రూ.కోట్ల ప్రజాధనం దుర్వినియోగం..! ఖజానా లూటీ చేస్తున్న చంద్రబాబు..!
చంద్రబాబు దుబారా ఖర్చులకు హద్దే లేకుండా పోతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సొంత పనుల కోసం రూ.కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నాడు. ఆదాయం లేకపోవడంతో నిరుపేదల సంక్షేమానికి నిధులు కేటాయించలేకపోతున్నానని బీద అరుపులు అరుస్తూ...తన టెంపరరీ క్యాంపు, అక్రమ ఇంటికి మెరుగులు దిద్దేందుకు రూ.కోట్లు కుమ్మరిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. రాష్ట్రంలో రోడ్లు అధ్నాన్నంగా ఉన్నా పట్టించుకోని చంద్రబాబు, ఇళ్లు లేని పేదలగోడు పట్టని చంద్రబాబు... తన పనులు చక్కబెట్టుకునేందుకు మాత్రం తెగ తాపత్రయ పడుతున్నాడు. ఖజనా మొత్తం లూటీ చేస్తున్నాడు.
అక్రమ ఇంటిలో అవినీతి రాజు..!అక్రమ నిర్మాణాలను కూల్చేయాలంటూ గతంలో బీరాలు పలికిన చంద్రబాబు...వాటిలోనే ఒకదాన్ని తన నివాసగృహంగా మార్చుకొని అక్రమార్కులకు అండగా నిలుస్తున్నాడు. గతంలో కృష్ణానదీ గర్భంలో నిర్మించిన 21 అక్రమ భవంతులను కూల్చేయాలని చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించాడు. అందులో ఒకటి లింగమేని అతిథి గృహం . ఇప్పుడు దాన్నేతాత్కాలిక నివాసంగా మార్చేసుకున్న చంద్రబాబు... మౌళిక సదుపాయాల పేరుతో కోట్లాది రూపాయలు దుబారా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిగిలిన 20 అక్రమ నిర్మాణాలకు చంద్రబాబు భరోసా కల్పించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
భవనాల సోకుల కోసం ప్రజాధనం లూటీ..!విజయవాడలోని నీటిపారుదల శాఖ కార్యాలయాన్ని, లింగమనేని అతిథి గృహాన్ని తాత్కాలిక క్యాంపు కార్యాలయం, నివాస గృహాలుగా మార్చుకున్న చంద్రబాబు అందుకోసం రూ.కోట్లు వెచ్చిస్తున్నాడు. క్యాంపు కార్యాలయం కోసం గతంలో రూ.10.20 కోట్లు ..తాజాగా, నీటిపారుదల శాఖ నుంచి మరో రూ.14.65 కోట్లు విదిల్చారు. ఇక అతిథి గృహానికి నగిషీలు అద్దేందుకు రూ. 16 కోట్లు, రహదారుల నిర్మాణం కోసం రూ.70 కోట్లు కేటాయించారు. ఇలా చంద్రబాబు తాత్కాలిక భవనాల కోసం ఇప్పటివరకు రూ. 110.85 కోట్లను ఖర్చుచేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇదే వ్యయంతో అధునాతన శాశ్వత సీఎం కార్యాలయంతో పాటు, క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేయవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి