సినిమా చివరి రీలు మొదలైంది

  • సినిమాలో నిజమైన హీరో ఇంట్రడక్షన్ చాలా సాధారణంగా ఉంటుంది. 
  • ఎక్కడో ఎవరికో సాయం చేస్తూనో... 
  • ఇంకెవరినో చేయిపట్టుకని రోడ్డు దాటిస్తూనో...
  • ఇంకెక్కడో నలుగురికి మంచి చేస్తూనో మొదలవుతుంది
అదే విలన్ విషయానికి వస్తే... పెద్ద పెద్ద భారీ సెట్టింగులు, వింత వింత శబ్దాలు, ఆర్భాటాలు, చుట్టూ వందమంది కాపలా ఇలా మొదలవుతుంది. ఆ తర్వాత అతని అరాచకాలు మొదలవుతాయి. ఎక్కడా ఓటమిలేని, ఓటమి ఎరుగని మనిషిలా బిల్డప్ కూడా పెరిగిపోతుంది. కానీ చివరి రీలు మొదలయ్యేసరికి అతని పతనం ప్రారంభమవుతుంది. పైకి కనిపించేదంతా ఒట్టి మాయ అని... చెప్పేదంతా అభూత కల్పన అని, చుట్టూ మూగిన మంద అంతా అతనికి లేని బలాన్నిఉన్నట్టుగా చూపించడానికి అని తేలిపోతుంది. ఇప్పుడు సరిగ్గా ఆంధ్రప్రదేశ్ లో అదే ఘట్టం మొదలుకాబోతుంది. మోసకారి చంద్రబాబు అధికార సినిమా చివరి అంకానికి వచ్చేసింది. నవంబర్ 6 నుంచి ఎపి ప్రతిపక్షనేత, దివంగతనేత వైయస్ తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టనున్న మహాపాదయాత్ర... చంద్రబాబు అబద్ధాల సినిమా అంతానికి శ్రీకారం చుట్టబోతోంది. వైయస్ జగన్ చాలా సందర్భాల్లో ప్రజలతో చెప్పినట్టుగా, 2014 నుంచి సాగుతున్న ఎపి పొలిటికల్ సినిమాలో చివరి రీలు మొదలుకాబోతుంది. ఇడుపులపాయనుంచి మొదలు కానున్న ప్రజాసంకల్పం పాదయాత్రతో బాబు దొంగ సర్కారు పతనం ప్రారంభం కావడం కాయమంటున్నారు జనం. 

3000 కిలోమీటర్ల పాదయాత్ర ముగిసే సరికి, సినిమాలో బాబు విలన్ పాత్రకు మూడినట్టేనని సామాన్య జనం ముక్తకంఠంతో చెబుతున్నారు. ఇన్నాళ్లూ తిమ్మిని బమ్మిని చేస్తూ, రోజుకో అబద్ధం చెబుతూ నెట్టుకొస్తున్న బాబు బండారాన్ని... కోట్ల మంది ప్రజలతో మమేకం అవడం ద్వారా మరోసారి తేటతెల్లం చేయడానికి జగన్ సిద్ధమయ్యారు. ప్రజల ఇతిబాధలు తెలుసుకుని వాళ్లను ఓదార్చడంతోపాటు... బాబు చేసిన మోసాలను కళ్లకు కట్టి, అన్నొస్తున్నాడు అనే భరోసాను వారి గుండెలనిండా నింపడానికి మహానేత ఆశయాల వారసుడు, యువనేత, జననేత వైయస్ జగన్ సదా సన్నద్ధమయ్యారు. దీంతో ఎపి పొలిటికల్ సినిమాలో చివరి రీలు పూర్తయ్యేసరికి విజయకేతనం ఎగరవేసే హీరోగా జగన్మోహన్ రెడ్డిని చూడటం ఖాయమనే మాట తెలుగునాట మార్మోగుతోంది. ఇది విన్న పచ్చకుంపటి గుండె వేగం పెరిగి భయంతో వణుకుతోంది.

తాజా వీడియోలు

Back to Top