హరితాంధ్రలో రక్తపుటేర్లు

  • – రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషిస్తున్న చంద్రబాబు 
  • – వైయస్‌ఆర్‌ నీరు పారించిన నేలపై రక్తపు మరకలు పారిస్తున్న బాబు
  • – నారాయణరెడ్డి నిందితులకు ప్రభుత్వం భరోసా
  • – హంతకులను పట్టుకోవడంలో పోలీసుల అలసత్వం
  • – వైయస్‌ఆర్‌సీపీ నాయకులే టీడీపీ టార్గెట్‌  
రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఫ్యాక్షన్‌ రాజకీయాలు అంతం కావాలని కోరుకుంటుంటే చంద్రబాబు మాత్రం ఎంత ఎక్కువ జరిగితే అంత మంచిదనే భావనలో ఉన్నాడు. ఫ్యాక్షన్‌ దాడుల్లో మృతుల చితిమంటల్లో చలి కాచుకునే విధంగా రాయలసీమలో ఫ్యాక్షన్‌ హత్యలను ప్రోత్సహిస్తున్నాడు. చెరుకులపాడు నారాయణరెడ్డి చనిపోయి మూడు రోజులు గడిచినా ఇంతవరకు ఒక్కర్ని కూడా అరెస్టు చేయలేదు. పైగా ఆయన మాట్లాడే మాటలు ఫ్యాక్షనిజానికి మద్ధతు పలికేలా ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్న పెద్ద మనిషి నిందితులను పట్టుకుని శాంతి భద్రతలు కాపాడల్సింది పోయి.. పాత కక్షలకు బలైపోయాడని వ్యాఖ్యానించడం ఇలాంటి ఫ్యాక్షన్‌ హత్యలకు ఊతమివ్వడమే. 

సోషల్‌ మీడియాపై అత్యుత్సాహం...
సోషల్‌ మీడియాలో తమపై నెటిజన్లు పోస్టులు పెట్టారన్న కారణంగా హడావుడిగా అర్ధరాత్రి అరెస్టులు చేయించిన చంద్రబాబు.. ఫ్యాక్షన్‌ హత్యల్లో ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థిని అతి దారుణంగా నరికి చంపినా విచారణ లేదు. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రిపైనే నారాయణ రెడ్డి కుటుంబసభ్యులు ఆరోపణలు చేసినా ఇంతవరకు విచారణ మొదలే పెట్టలేదు. పైగా గన్‌ లైసెన్సు గురించి నాకు చెప్పలేదే అని కేఈ ప్రభాకర్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం.. టీడీపీ నాయకులు పరిటాల రవి హత్యతో పోల్చి చూడటం.. పాత కక్షలతోనే చంపేశారని ముఖ్యమంత్రి చెప్పడం చూస్తుంటే బాబు నిర్లక్ష్య ధోరణి పూర్తిగా కనిపిస్తుంది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో నారాయణరెడ్డి హత్య జరిగితే పోలీసులు మధ్యాహ్నం వరకు స్పందించకపోవడం చూస్తే నిందితులకు పోలీసుల అండదండలు ఉన్నాయనేది స్పష్టంగా తెలుస్తుంది. పైగా నిత్యం సోషల్‌ అవేర్‌నెస్‌ పేరుతో పాటలతో హడావుడి చేసే జిల్లా ఎస్పీ రవికృష్ణ వ్యవహారం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. గతంలో భూమా నాగిరెడ్డి వైయస్‌ఆర్‌సీపీలో ఉన్న సమయంలో ఆయనకు ఆరోగ్యం బాగా లేకున్నా దౌర్జన్యంగా అరెస్టు చేసి తీసుకెళ్లిన సంఘటన అప్పట్లో సంచలనమే అయింది. అదంతా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఎస్పీ రవికృష్ణ చూపించిన అత్యుత్సాహం. అదే ఎస్పీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి చెందిన నియోజకవర్గ ఇంచార్జిని అతి కిరాతకంగా చంపినా ఇంతవరకు ఒక్క అరెస్టు కూడా జరగలేదు. పైగా దాడికి ఉపయోగించిన ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ లాంటి వ్యక్తి చెప్పడం  శోచనీయం. నిజానికి ఒక కాల్‌ రికార్డులను తెప్పించుకుని నిందితులను పట్టుకోవడం వారికేమంత కష్టం కాదు. నిందితులను పట్టుకోవడం ఎలాగో పోలీసులకు చెప్పాల్సిన పనిలేదు. పైగా నారాయణ రెడ్డిని చంపిన రోజు పక్క గ్రామాల్లో టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్న విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపినా పోలీసులు పట్టించుకోకపోవడం కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించడమే. 

పరిటాల రవి కేసును సీబీఐకి అప్పగించలేదా..
నారాయణరెడ్డి హత్య జరిగిన తర్వాత టీడీపీ నాయకులు చేస్తున్న వితండ వాదన ఒకటే. పరిటాల రవి హత్య కేసులో ఏం చేశారని. కానీ హత్య జరిగిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి సీబీఐ దర్యాప్తుకు ఆదేశించారు. తన కొడుకు వైయస్‌ జగన్‌తోపాటు జేసీ దివాకర్‌రెడ్డి తదితరులపై ఆరోపణలు రావడంతో అసెంబ్లీ సాక్షిగా రవి హత్య కేసును సీబీఐకి అప్పగిస్తామని ప్రకటించారు. వైయస్‌ జగన్‌ నిర్దోషి అని సీబీఐ విచారణలో వెల్లడైంది. కానీ చంద్రబాబుకు అలా చేసే ధైర్యం ఉందా. టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 15 మందిని అతి కిరాతకంగా టీడీపీ నాయకులు చంపుతుంటే చోద్యం చూస్తున్నారే తప్ప ఒక్క దానిపైనా విచారణకు ఆదేశించిన దాఖలాలు లేవు. రాయలసీమలో నక్సలిజాన్ని, ప్యాక్షనిజాన్ని అంతం చేయాలని వైయస్‌ఆర్‌ కంకణం కట్టుకుంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. ఆ మహానుభావుడు ఎప్పడూ అంటుండేవారు ప్యాక్షన్‌తో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని.. అలాంటి దుస్థిని నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని. అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించి హరితాంధ్ర ప్రదేశ్‌ రూపకల్పనకు భగీరథుడిగా కష్టపడి పనిచేశారు వైయస్ఆర్. ఆయన నిర్మించిన హరిత వనంలో చంద్రబాబు ప్యాక్షన్‌ హత్యలతో రక్తపుటేర్లు పారిస్తున్నాడు. 
Back to Top