బాబు గారి అవినీతి రాజ్యం‍

మూకుట్లో చేయి పెట్టి నీ మూతి తుడుచుకో అన్నారట వెనకటికొకరు. అలాగుంది ఎపి సిఎమ్ చంద్రబాబు వాలకం. వేలకోట్ల ఆస్తులు సంపాదించుకుని, బినామీల పేర పెట్టిన  చంద్రబాబు ఉత్తుత్తి మాటలతో చేసే విడ్డూరాలు చూసి తీరాల్సిందే. అట్టముక్కలతో అసెంబ్లీ భవనాలు కావాలని కోరుకుంటున్న ఈ అభినవ  మాయా ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ఆస్తులన్నీ ప్రభుత్వ పరం చేయాలని మాట్లాడుతున్నాడు.   హెరిటేజ్ సంస్థలు స్థాపించి, అక్రమంగా వేలాది ఎకరాలు కబ్జాలు చేసిన బాబు ఆస్తులు ఎవరికి అప్పగించాలో ఆయనే చెప్పాలి. మూడున్నరేళ్లుగా రాష్ట్రాన్ని ఎడాపెడా దోచేస్తూ చంద్రబాబు ధనదాహంతో రగిలిపోతున్నాడు. 

చంద్రబాబు గత మూడున్నరేళ్లలో నష్టాల్లో ఉన్న హెరిటేజ్ కంపెనీకి కావాల్సినంత అండదండలందించి, అందుకోసం అగ్రిగోల్డును ముంచి తన అనుయాయులు కోట్లకు పడగెత్తేలా చేసారు. ఇది అధికార దుర్వినియోగం చేసి సంపాదించిన ఆస్తి కాదా? ఎథిక్స్ కమిటీ ముందు తమ కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటించినప్పుడు కూడా అన్నీ అబద్ధాలు ఆడలేదా. కొద్దిగా బాంక్ బాలెన్స్ పెరిగిందని, భార్య ఆస్తులు అలాగే ఉన్నాయని, హోల్డింగ్ ఆస్తుల విలువ జస్ట్ 90లక్షలు మాత్రమే పెరిగిందని నోటికొచ్చినన్ని అబద్ధాలు ఆడలేదా..! ప్రజలు ఏం చెప్పినా నమ్మేస్తారనే భ్రమలో బాబు వేలకోట్ల ఆస్తులను కూడా వందలు వేలల్లో చెప్పడం ఏ పాటి నీతి నిజాయితీ కిందికి వస్తుంది?

1978లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన బాబు తనకు రెండున్నర ఎకరాల ఆస్తి ఉందని చెప్పాడు. ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే మంత్రి వర్గంలోచోటు సంపాదించాడు. 1994లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 99లో ఆస్తులు లెక్కలు 7.7 కోట్లు అని చెప్పాడు. 2004 నాటికి బాబుగారి ఆస్తి కేవలం 20కోట్లు ఉందిట. అది 2009కి 60కోట్లకు చేరిందని వివరించాడు. ఎప్పుడూ చంద్రబాబు వాస్తవ ఆస్తులు చెప్పిన పాపాన పోలేదు. ఆయనగారు ప్రకటించిన ఆస్తుల విలువే మార్కెట్లో వేలకోట్లు ఉంటుంది.

‘లెక్కలేనన్ని’ ఆస్తులు 
చంద్రబాబుకు పర్ఫెక్ట్ బినామీ అయిన సుజనా చౌదరి కంపెనీల్లో బాబుకు, ఆయన భార్య కు వాటాలు లేవా? క్విడ్ ప్రో కో ద్వారా లబ్ది పొందిన ఆస్తుల విలువకు అంతేలేదు. అడిగినా కర్ణాటక, మహారాష్ట్రాలో ఉన్న ఆస్తుల ఊసెత్తడు బాబు.  హైటెక్ సిటీ చేరువలో మదీనా గూడాలోనూ భార్య, కొడుకు పేరిట పదుల ఎకరాల భూములు ఉన్నాయి. ఇవన్నీ... రెండున్నర ఎకరాలు మాత్రమే ఉన్న చంద్రబాబు తల్లిగారు మనవడు లోకేష్ కి గిఫ్ట్ గా ఇచ్చిన ఆస్తి అని శెలవిచ్చారు. చంద్రబాబు అండ్ ఫ్యామిలీ మీడియా ముందు కాకిలెక్కలతో చెప్పే ఆస్తుల చిట్టా పద్దు చూసి ప్రజలే నివ్వెరపోతున్నారు. 

కెసిఆర్ చెప్పిన బాబు ఆస్తుల వివరాలు
మునుపు ఒకసారి కె.సి.ఆర్ చంద్రబాబు ఆస్తుల పద్దు విప్పారు. నెల్లూరు జిల్లాలో 300 ఎకరాలు భూమి చంద్రబాబుకు ఉందని, 17ఎకరాలు దళిత గిరిజనుల భూమిని చంద్రబాబు ఆక్రమించారని వెల్లడించారు. ముఖ్యమంత్రి కాకముందు చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్ పేరుమీద ఉన్న ఆస్తులను వేరే పేర్లమీద బదిలీ అయ్యాయని, విచారిస్తే వారంతా బాబు బినామీలని తేలిందని చెప్పారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా బాబు తన పేరున ఉన్న బలాయిపల్లి ఆస్తులను గిఫ్ట్ కింద కొడుకు పేరుకు బదలాయించినట్టు ఆధారాలున్నాయన్నారు. అలాగే కొడుకు లోకేష్ కూడా తండ్రికి 6.30 ఎకరాలు గిఫ్ట్ గా ఇచ్చాడన్నారు. రాష్ట్రాన్ని దోచుకుని తండ్రీ కొడుకులు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం విడ్డూరం అని విమర్శించారు. 

మామను వెన్నుపోటు పొడిచి, కుర్చీ ఎక్కినప్పుడు అడ్డదారుల్లో దోచుకున్నది కాక, ఈ మూడున్నర ఏళ్లలోనే చంద్రబాబు మూడున్నర లక్షల కోట్లు అవినీతి సొమ్ము పోగేసుకున్నారని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల ముందు ఎండగడుతూనే ఉన్నారు. పాపం ఇంత పేద సిఎమ్ ను దేశం మెత్తం మీద చంద్రబాబునే చూడగలం అని ఆయన భజన బృందాలు చెక్కభజన చేస్తున్నాయి. ఇక ప్రజలెప్పుడూమొహం చూడరని బాబుకి ఎప్పుడో అర్థం అయిపోయింది. అందుకే తన జీవితకాలం, ఆ తర్వాత కొడుకు, మనవడు ఇలా కటుంబ రాజకీయ మనుగడ కోసం కావల్సినంత పోగేసుకునే పనిలో ఉన్నాడు. ఎంత దోచుకున్నా లెక్కచాలట్టేదని, ప్రతిపక్షం మీద పడ్డాడి. బాబు తన అవినీతి సామ్రాజ్యాన్ని
పెంపొందించుకునేందుకు చేస్తున్న బరితెగింపు రాజకీయాలపై ప్రజలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బాబుకు తగిన గుణపాఠం 
చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరిస్తున్నాయి. 
Back to Top