చంద్ర‌బాబు విదేశాల బాట‌

హైద‌రాబాద్‌: ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు విదేశీ పర్య‌ట‌న వివాదాస్ప‌దం అవుతోంది. 2,3 నెల‌ల‌కోసారి విదేశాల‌కు వెళ్లిపోయి చ‌క్క‌ర్లు కొడుతున్నారు. ఈసారి ట‌ర్కీయాత్ర‌ల‌కు ఆయ‌న  త‌ర‌లివెళ్లారు.

2014 లో అధికారంలోకి వచ్చిన‌ప్ప‌టి నుంచి చంద్ర‌బాబు విదేశాల మీద మ‌న‌స్సు పారేసుకొన్నారు. కొత్త రాజ‌ధాని అమ‌రావతి విదేశీసంస్థ‌ల ద్వారా సృష్టిస్తానంటూ ఆయ‌న ఆసియా దేశాల‌కు యాత్ర‌లు మొద‌లుపెట్టారు. బ‌హుశా భార‌తదేశంలో ఏ ముఖ్య‌మంత్రి 15 నెల‌ల కాలంలో ఇన్ని ప‌ర్య‌ట‌న‌లు చేసి ఉండ‌క పోవ‌చ్చ‌న్న మాట వినిపిస్తోంది. సింగ‌పూర్‌, చైనా, జ‌పాన్‌, ఇప్పుడు ట‌ర్కీకి ప‌ర్య‌ట‌న‌లు జ‌రుపుతున్నారు. సింగ‌పూర్కు అయితే ప‌దే ప‌దే వెళ్లివ‌స్తున్నారు. ప్రభుత్వ ఖ‌ర్చుల‌తో బ్యాచ్లు, బ్యాచ్లుగా వెళ్లిరావ‌టంపై విమ‌ర్శ‌లు రేగుతూనేఉన్నాయి.

ఖ‌రీఫ్సీజ‌న్లో రైతుల అవ‌స్థ‌లు అన్నీఇన్నీకావు. రుణ‌మాఫీ జ‌ర‌గ‌క  పాత అప్పులు తీర్చక‌ పోవ‌టంతో కొత్త రుణాలు పుట్టలేదు. బ్యాంక్ల్లో అప్పులు దొరికే ప‌రిస్థితి లేక‌పోవ‌టంతో, వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించాల్సి వ‌స్తోంది.   మొత్తంగా అప్పుల ఊబిలో కూరుకొనిపోయిన రైత‌న్న‌కు అప్పుల బెడ‌ద ఎక్కువఅవుతోంది. చంద్ర‌బాబు నిర్వాకంతో కృష్ణా, గోదావ‌రి డెల్టాలు ఎడారులుగా మారిపోయే పరిస్థితి వ‌చ్చింది. దీంతో పంటపొలాలు ఎడారులుగా మారిపోతున్నా, ప్ర‌భుత్వం నుంచి ఏమాత్రం స్పంద‌న లేకుండాపోయింది. ఒక వైపున రాయ‌ల‌సీమ‌కు అన్యాయం జ‌రుగుతున్నా ప్ర‌భుత్వం గ‌ట్టిగా మాట్లాడ‌టం లేదు. తెలంగాణలో రాజ‌కీయ స్వార్థం కోసం రాయ‌లసీమ వైపు గ‌ట్టిగా వాదించటంలేదు. అంతిమంగా ప్ర‌జ‌ల‌కు అన్యాయం జ‌రుగుతున్నా, ముఖ్య‌మంత్రిహోదాలో ఉండి ప‌ట్టించుకోవ‌టంలేదు.

మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు తీవ్రంగా జ‌రుగుతున్నాయి. మ‌హిళా త‌హ‌శీల్దార్ వ‌న‌జాక్షి మీద ఎమ్మెల్యే చింత‌మ‌నేని దాడి చేయిస్తే, ముఖ్య‌మంత్రి స్వ‌యంగా ఆమెను బెదిరించి పంపించారు. దీంతో ఆమెను చంపేస్తామంటూ ప‌చ్చమాఫియా బెదిరింపులు పంపిస్తోంది. ఈబెదిరింపులు ఒక ఎత్త‌యితే, ఇప్పుడు చింత‌మ‌నేనికి తుపాకీ లైసెన్స్ ఇప్పిస్తున్నారంటూ వార్త‌లు బ‌య‌టప‌డ్డాయి. అస‌లే 50కుపైగా పోలీసుకేసుల్లో నిందితుడు, పైగా రౌడీషీట్తో అంద‌రినీ వ‌ణికిస్తున్న చింత‌మ‌నేనికి తుపాకీ ఇప్పించ‌టం అంటే మహిళా ఉద్యోగులు కంగారు ప‌డుతున్నారు.

కృష్ణా, గుంటూరు జిల్లాలో విషజ్వ‌రాలు వ‌ణికిస్తున్నాయి. గ్రామాల‌కు గ్రామాలే జ్వ‌రంతో త‌ల్ల‌డిల్లిపోతున్నాయి. అటువంటి చోట వైద్యశిబిరాల ఏర్పాటు, మందుల పంపిణీ వంటి విష‌యాల్ని ఏమాత్రం ప‌ట్టించుకోవ‌టంలేదు. ప్ర‌భుత్వ యంత్రాంగం ర్యాంకింగ్లగోల‌లో ఉండి మౌళిక అవ‌సరాల్ని గాలికి వ‌దిలేసింది.

రాష్ట్రం ఇన్ని స‌మ‌స్య‌ల్లో కూరుకొనిపోయి ఉంటే చంద్ర‌బాబు హాయిగా విదేశీయాత్ర‌ల‌కు బ‌య‌లుదేరటంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

Back to Top