రాజ‌ధాని పేరుతో వందేళ్ల‌కు శాపం


హైద‌రాబాద్) కొత్త రాజ‌ధాని ప్రాంతాన్ని హోల్ సేల్ గా అమ్మేసేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కంక‌ణం క‌ట్టుకొన్నారు. ఇది ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణో, పాత్రికేయుల కామెంటో కాదు. ఘ‌న‌త వ‌హించిన సింగ‌పూర్‌సంస్థ‌లు ఇచ్చిన మాస్ట‌ర్ ప్లాన్ చెబుతున్న క‌ఠోర వాస్త‌వాలు. మాస్ట‌ర్ ప్లాన్ ను పూర్తిగా చ‌దివితే, అర్థం అవుతాయి. రాజ‌ధాని పేరు చెప్పి 54, 272 ఎక‌రాల్ని చుట్ట బెట్టేశారు. అంత‌టి భూమిలోనూ ప్ర‌భుత్వ అవ‌స‌రాలు, మౌళిక వ‌స‌తులు పోనూ 21, 870 ఎక‌రాల దాకా మిగులుతున్న‌ట్లు తేలింది. ఇదంతా ప్రైవేటు డెవ‌ల‌ప‌ర్ల‌కు అప్ప‌చె్పి రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్ర‌భుత్వం రంగం సిద్దం చేసింది. సింగ‌పూర్ కంపెనీలు కానీ, ప్రైవేటు సంస్థ‌లు కానీ రాజ‌ధాని పేరుతో నిలువు దోపిడీ చేసుకొనేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నాయి. 
వాస్త‌వానికి చంద్ర‌బాబు ఐదు సంవ‌త్స‌రాల కాలానికి అధికారంలోకి వ‌చ్చారు. ప్ర‌భుత్వాలు ఆ ఐదేళ్లు పాలించ‌టం స‌హ‌జం. కొన్ని సార్లు వాటి ప్ర‌భావం ప‌ది , ప‌దిహేను ఏళ్ల పాటు ఉంటుంది. కానీ చంద్ర‌బాబు చేస్తున్న ఈ దోపిడీ 99 ఏళ్ల దాకా అమ‌ల్లో ఉంటుంది. ఎందుకంటే ప్రైవేటు సంస్థ‌లు లేదా సింగ‌పూర్ జేబు కంపెనీలకు 99 సంవ‌త్స‌రాల పాటు లీజుకు ఇచ్చేస్తున్నారు. ఇంత కాలానికి లీజుకి ఇచ్చేసి ప్రైవేటు సంస్థ‌ల పాలిట క‌ల్ప వృక్షంగా రాజ‌ధానిని చేస్తున్నారు. ఇంత‌టి దారుణ మైన దోపిడీతో రాజ‌ధాని ప్రాంతంలోని సామాన్యులంతా తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు.
Back to Top