<br/>సిఎం రమేష్ ను ఇరికించే కుట్ర, చంద్రబాబును అరెస్టు చేసే కుట్ర, మోదీ చేస్తున్న ఆపరేషన్ బిరడా కుట్రా అంటూ టిడిపి ప్రభుత్వం కంటే ఎక్కువగా ఎల్లో మీడియా తెగ కన్నీరు కారుస్తోంది. సిబిఐ కాదది ఛీబిఐ అంటూ ముక్కు చీదేస్తోంది. ఏపాపం తెలియని పాలవంటి తమ పచ్చ బాచ్ మీద అవినీతి ఆరోపణలు చేస్తారా?? మీరు మట్టికొట్టుకుపోతారు. మా శాపాలే తగిలి సిబిఐ పరువు గంగలో కలిసింది అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. అంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం చెప్పినట్టల్లా ఆడి సిబిఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయన్నమాట. మరి అలా ఐతే కెడి లక్ష్మీనారయణను వాడుకుని వైఎస్ జగన్ మీద కేసులు బనాయించి, అన్యాయంగా జైల్లో మగ్గేలా చేసింది కూడా ఈ ఛీబీఐ అని అర్థం కదా! దొంగ సాక్ష్యాలు సృష్టించాడంటూ సిబిఐ అధికారి దేవేంద్ర కుమార్ ను అరెస్టు చేసినట్టుగా, ఆస్థానాపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా ఈ కెడీ లక్ష్మీనారాయణను అరెస్టు చేసి విచారణ ఎందుకు చేయరు? జగన్ ఎపిసోడ్ ను చంద్రబాబుకు అనుకూలంగా నడిపించిన జెడి లక్ష్మీనారాయణ ఉద్యోగానికి రాజీనామా చేసి, తిరిగి ఎపి రాజకీయాల్లో చక్రం తిప్పేదుకు రావడాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోరు? చంద్రబాబుకు, నాటి కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రత్యర్థి అయిన జగన్ పై కావాలనే కుట్రలు చేసిన పావుగా జెడి లక్ష్మీనారాయణను విచారించే తీరాలి. నేడు చంద్రబాబు కోసం కాపు లీడర్లతో మాట్లాడి మధ్యవర్తిత్వం చేస్తున్నఈ మాజీ అధికారి, ఉద్యోగంలో ఉండగా చేసిన అధికార దుర్వినియోగంపై కేసులు పెట్టేతీరాలి. జెడి జగన్ పై పెట్టిన కేసుల్లో సరైన ఆధారాలే లేవని కోర్టు కొట్టేస్తోంది. అంటే ఉద్దేశపూర్వకంగా పెట్టిన కక్షసాధింపు చర్యలివని బైటపడ్డట్టే కదా? ఇక అదే సమయంలో చంద్రబాబు పై విచారణ చేయాల్సి వచ్చినప్పుడు సిబ్బంది లేరని సాకు చూపిన ఈ అత్యుత్తమ విచారణాధికారిపై సిబిఐ ఎందుకు చర్యలు తీసుకోదు? నిజమే సిబిఐ కుట్రలు చేస్తోంది. అప్పుడు కాంగ్రెస్, టిడిపిలతో కలిసి, నేడు బిజెపి టిడిపిలతో కలిసి.