అభ్యర్థిస్తే అంటరానివారిగా చూస్తారా..?

– క్షురకులు సెక్రటేరియట్‌కు రావడం తప్పా..?

– కష్టాలొస్తే పేదోడు ముఖ్యమంత్రిని కలవొద్దా

–  తోక కత్తిరిస్తా
అనడం హేళన కాదా..?

– రాజ్యాంగ స్ఫూర్తిని మంటగలిపేలా బాబు వైఖరి

 

 ముఖ్యమంత్రి అనే వాడు వ్యక్తి కాదు.
ఒక శక్తి. ఎన్నో వ్యవస్థలను సమన్వయం చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన
బాధ్యత ఆయన చేతుల్లో ఉంటుంది. అందులో భాగంగా అన్ని వర్గాలను సమాన దృష్టితో
చూడాల్సిన కనీస బాధ్యత ఆయనది. కానీ అలాంటి ముఖ్యమంత్రి భాగ్యవంతులతో ఒకలా..
కార్మికులతో మరోలా వ్యవరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. బాధ్యతల స్వీకార
సమయంలో చేసిన ప్రమాణాలను పట్టించుకోకపోవడం వాటిని తుంగలో తొక్కడం లాంటిదే.
ముఖ్యమంత్రి చంద్రబాబు అచ్చం అదే తీరుతో వ్యవహరిస్తున్నాడు. తాను పేదోళ్లకు
ముఖ్యమంత్రిని కాదన్నట్టుగా మాట్లాడుతున్నారు. పేదోళ్లను అంటరానివాళ్లలా
చూస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించమని వేడుకునేందుకు సెక్రటేరియట్‌ వద్దకు
వచ్చిన క్షురకులతో చంద్రబాబు అన్నమాటలు ఆయన స్థాయికి తగ్గట్లుగా లేవన్నది వాస్తవం.
అసలు మిమ్మల్ని ఇక్కడికి రానివ్వడమే తప్పు..అని మాట్లాడి క్షురకుల మనోభావాలను
తీవ్రంగా గాయపరిచాడు... 

 తోక జాడిస్తే కత్తిరిస్తా..
ఏమనుకున్నారు.. జీతాలు పెంచను గాక పెంచను.. సెక్రటేరియట్‌ ఒక దేవాలయం.. ఇక్కడికి
రావడానికి మీకెంత ధైర్యం.. దేవుడి ఆలయంలోనే కూర్చోబెట్టి తలనీలాలు కత్తిరించే
క్షురకులతో చంద్రబాబు అన్న మాటలివి. ఆకలి బాధలకు తాళలేక.. ఆర్థిక సమస్యలతో కుటుంబ
భారాన్ని మోయలేక ముఖ్యమంత్రిని సాయమడిగితే అభం శుభం తెలియని వాళ్ల మీద నోరు
పారేసుకున్నాడు. 

 నేను సీఎంగా ఉండగా ఏ కులం వాళ్లకూ
రోడ్డెక్కే అవకాశం ఇవ్వలేదు. మీ ధర్నాలు, దీక్షలకు భయపడను. రాజకీయాలు చేస్తే
సహించను. వెంటనే టెంట్లు ఎత్తేయండి. లేదంటే తోలు తీస్తా. ఖబడ్డార్‌...ఎన్నికల
హామీలు నెరవేర్చాలన్న మత్స్యకారులను కూడా గతంలో  చంద్రబాబు బెదిరించారు. 

 ‘ఏం పిచ్చపిచ్చగా ఉందా? తమాషాలు చేస్తున్నారా? మేం అధికారంలోకి
వస్తే మీ అంతుచూస్తా! ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. ఎవరనుకున్నావ్‌ నన్ను. యూజ్‌లెస్‌
ఫెలో.. తాట తీస్తా.. నీ ఉద్యోగం ఊడగొడతా..!’ ప్రతిపక్షంలో ఉండగా ఏపీ భవన్‌
ఉద్యోగులపై చంద్రబాబు విరుచుకుపడిన తీరు. ఆయన వాడిన భాష. 

 హేయ్‌.. నీ పేరేంటి...? ఏం
మాట్లాడుతున్నావ్‌. నీ ఇంటికి కలెక్టర్‌ను పంపిస్తా. నీ అంతు తేలుస్తా. ఏ పార్టీ
నీది. 

నంద్యాల ఎన్నికల ప్రచారంలో ఉండగా
ఆయన్ను ప్రశ్నించిన ఓటరుపై చంద్రబాబు మండిపడిన తీరుకి నిదర్శనం ఆ సంఘటన. 

 చంద్రబాబుకు గొప్పలు చెప్పుకోవడం
అలవాటై పోయింది. ఆయన చెప్పిందే వేదం అన్నట్టు రాయడం పచ్చ మీడియాకు అలవాటైంది.
అవన్నీ చూపించి మేధావిలా 40 ఏళ్లు నెట్టుకొచ్చిన చంద్రబాబు  ఇటీవల ఎదురవుతున్న ప్రతిఘటనను తట్టుకోలేకపోతున్నారు.
సామాన్యుల మీద చంద్రబాబు ఆగ్రహావేశాలను వెళ్లగక్కుతుంటాడు. తనను ప్రశ్నిస్తే వారి
మీద విరుచుకుపడిపోతుంటాడు. ఆయన మాటను లెక్కచేయడం లేదనే భావన ఆయన్ను వేధిస్తూ
వుంటుంది. ఎవరి మాటా వినడు. చంద్రబాబు లోపాలను ప్రశ్నిస్తే అందరితోనూ ఆయనిలాగే
దురుసుగా ప్రవర్శిస్తారు. ఇబ్బంది పెట్టే ప్రశ్నలడిగితే నిన్ను జగన్‌ పంపించాడు
అంటూ విరుచుకుపడిపోతాడు.ప్రెస్‌మీట్‌లో జర్నలిస్టులకు కూడా సమాధానం చెప్పని సీనియర్‌
మోస్ట్‌ పొలిటీషియన్‌ ఆయన. 

Back to Top