ప్రచారం జాస్తి- చికిత్సలు నాస్తి

ఆరోగ్య ఉత్సవాలు
జరిగాయి ఏపిలో. విశాఖలో జరిగిన ఈ నాలుగు రోజుల కార్యక్రమంలో చివరి రోజు చంద్రబాబు
మాట్లాడారు. ఆరోగ్యశాఖ, ప్రైవేటు సంస్థ కలిసి చేస్తున్న ఈ వేడుకల్లో సాంకేతిక ప్రసంగాన్ని
వినిపించారు. అన్ని శాఖల్లో లాగే ఆరోగ్య శాఖను కూడా అంతా ఆన్ లైన్  చేసేసాం దేశంలోనే ఈ విషయంలో మనమే నెంబర్ వన్ అంటున్నాడు చంద్రబాబు. టెలీమెడిసిన్, రేడియో ఫ్రీక్వెన్సీ
ఐడెంటిఫికేషన్ అంటూ ఆన్ లైన్ పరిభాషలో ఆంధ్రా ప్రజల ఆరోగ్యం కోసం అన్ని పనులు చేస్తున్నామని
చెప్పుకున్నారు. ఆర్భాటంగా అరడజను పథకాల ప్రారంభోత్సవం కూడా చేసాడు చంద్రబాబు. గతంలోని
పథకాలే పందికొక్కుల పాలౌతుంటే, కొత్తగా కేంద్ర పథకాలను, ముఖ్యమంత్రి
పేర ప్రచారం చేస్తున్నారు.

ఎలుకల పాలైన
పసిబిడ్డలు

గుంటూరు
జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఇంక్యుబేటర్ లో ఉన్న పసి కందు ఎలుకుల బారిన పడి మృతిచెందింది. ఇది ప్రభుత్వాసుప్రతుల
పరిస్థితి. ఆరోగ్య శ్రీ లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులవైపు చూడలేని దుస్థితి. రాష్ట్రంలో
వైద్య ఆరోగ్య శాఖ లో 30 పథకాలుంటే అందులో సగం పథకాలు మొదలైన మూడు నాళ్లకే మూలకు చేరాయి. గ్రామీణ
సంచార చికిత్సాలయం, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, టెలీమెడిసిన్
వంటి పథకాలన్నీ ఆచరణలో ఉపయోగం లేకుండా తయారయ్యాయి.

టెలీ మెడిస్
ఓ మాయ

సూపర్ స్పెషాలిటీ
వైద్యం అంటూ ఆర్భాటంగా మొదలెట్టిన టెలీమెడిసిన్ సర్వేస్ ప్రొవైడర్లకు కోట్లు కుమ్మరిస్తోంది
తప్ప ప్రజలకు ఉపయోగ పడటం లేదు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలుగా
మార్చారు. వాటికి నిధులను ఎక్కువగా పెంచారు. కానీ ఏంలాభం
ఆ సొమ్ము ప్రజల వైద్యానికి, ఆపరేషన్లకు, మందులకు, ఆరోగ్యకేంద్రాల్లో సౌకర్యాల మెరుగుదలకు కాక, సర్వీస్
ప్రొవైడర్లకు ప్రైవేటు కంపెనీల జేబుల్లోకి వెళుతోంది. ముఖ్యమంత్రి
మహాగొప్పగా చెబుతున్న ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరత, కొన్ని చోట్ల
డాక్టర్లు ఉండరు. సాంకేతిక సమస్యల వల్ల టెలిమెడిసిన్ ఎక్కడా సవ్యంగా పనిచేస్తున్న
దాఖలాలు లేవు. సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ను లైన్లోకి తీసుకోవడానికి గంటలు గంటలు
 సిబ్బంది పడిగాపులు పడాల్సి వస్తోంది. వీడియో కాన్ఫరెన్స్
ద్వారా చికిత్స సూచనలు, మెడిసిన్ ఇవ్వడం లో తీవ్ర జాప్యం జరుగుతోంది. చేసేదిలేక
రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిపోతున్నారు. ఇదీ ఆరోగ్య
శాఖలో చంద్రబాబు సాధించిన సాంకేతికత .

పెరిగిన
నిధులు ప్రైవేటు సంస్థల జేబుల్లోకి

పూర్వం ప్రైవేటు
సంస్థలు నడిపే అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లకు నిర్వాహణ ఖర్చు 90,000 ఇచ్చేది. ఇప్పుడు
అవి ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలుగా మారాకా నెలకు 4.10 లక్షలు ఇస్తున్నారు. ఇందులో అధికభాగం
సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లించడానికే పోతోంది. ఆరోగ్య శాఖ
తీరు ఇంత చందంగా ఉండగా ఎపిని మెడికల్ హబ్ గా మారుస్తానంటూ చంద్రబాబు ప్రగల్బాలకు
పోతున్నారు.

Back to Top