బాధితులకు గోడు పట్టని బాబు

ప్రభుత్వం ప్రజల కోసం పని చేయాలి. ప్రజల కష్టాలు
తీర్చచేందుకు పాటుపడాలి. ప్రజలకు అన్యాయం జరిగితే న్యాయం చేయాలి. కాని
ఆంధ్రప్రదేశ్ లో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఈ రోజు కాదు గత నాలుగేళ్లుగా
అధర్మం గద్దెనెక్కి, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. అవినీతి పరులకు కొమ్ము
కాస్తూ, అధికారపు అండదండలందిస్తూ, అక్రమార్కులను అందలమెక్కిస్తూ తన విశ్వరూపాన్ని
చూపిస్తోంది. సామాన్యులు తమ గోడు చెప్పుకునే వీలుకూడా లేక రోడ్డెక్కి రోదిస్తున్నాడు.
తమ అన్యాయానికి బదులిచ్చేదెవరని ఆక్రోశిస్తున్నాడు.

బాధితులకు అందని న్యాయం

మాకు జరిగిన అన్యాయాన్ని విని, కాస్త సాయం చేయండి
మహాప్రభో అని చెప్పుకోడానికి ముఖ్యమంత్రి మొరపెట్టుకోడానికి వచ్చాడో సామాన్యుడు. సచివాలయం
బైట నిత్యం పడిగాపులు పడుతున్నాడు. కుటుంబంతో కలిసి వచ్చి మండుటెండలో కూర్చుని తన
గుండె మంటను కార్డు మీద రాసి ప్రదర్శిస్తున్నాడు. పసివాళ్ల ముఖం చూసైనా
కరుగుతారేమో, కరుణించి తమ కథను విని సాయం 
చేస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఆరు నెలలుగా నిత్యం సచివాలయం
నిలబడ్డ ఆ కుటుంబాన్ని పలకరించిన నాధుడు లేడు. వైఎస్సార్ జిల్లా పొద్దుటూరుకు
చెందిన ఓ సామాన్యకుటుంబీకుడు శ్రీనివాసరెడ్డి. కడుపు కట్టుకుని తాను, తండ్రి,
భార్య సంపాదించిన ఐదు లక్షలను ఎక్కువ వడ్డీ ఇస్తానని, అడిగిన వెంటనే అసలు
అప్పజెబుతానని నోటు రాసిచ్చిన కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డి చేతిలో
పోసాడు. కొన్నేళ్లకు తన సొమ్ము తిరిగి ఇమ్మని కోరితే, రేపు మాపు అని తిప్పుకున్న
కేశవరెడ్డి చివరకు బోర్డు తిప్పేసాడు. తమ జిల్లాకు చెందిన మంత్రి కనుక సాయం
చేస్తాడని ఆదినారాయణ రెడ్డిని కలిసి తమ గోడు చెప్పుకున్నాడు. నిజానికి
కేశవరెడ్డికి స్వయానా వియ్యంకుడైన ఆదినారయణ రెడ్డి మాత్రం బాధితులకు సాయం
చేస్తాడా? ఎంక్వైరీలు, రికవరీలు అంటూ ప్రభుత్వం నుంచి కావాల్సినంత జాప్యాన్ని చేసి
వియ్యంకుడికి సాయపడ్డాడు. శ్రీనివాసరెడ్డకి మాత్రం వడ్డీతో సహా నీ సొమ్ము
ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. నెలలు గడిచినా ఒక్క రూపాయి కూడా అందకపోవడంతో పోలీసులను
ఆశ్రయించి, సిఐడి అధికారులకు ఫిర్యాదులు చేసి చివరకు విసిగిపోయి ముఖ్యమంత్రిని,
హోమ్ మంత్రిని కలిసి తన గోడు చెప్పుకోవాలని, తనకు న్యాయం చేయాలని కోరేందుకు
కుటుంబంతో సహా వెలగపూడి వచ్చాడు శ్రీనివాసరెడ్డి. ఆరు నెల్లుగా ముఖ్యమంత్రి
చంద్రబాబును కలిసే ప్రయత్నం చేస్తున్నాడు. పైనుంచి ఉన్న ఆదేశాల కారణంగా
శ్రీనివాసరెడ్డిని సచివాలయంలోకి అనుమతించట్లేదు. చంటి బిడ్డలతో, భార్యతో నిత్యం
ఎండ, వానల్లో తడుస్తూ తనకు న్యాయం కావాలని కోరుతున్నాడు. శ్రీనివాసరెడ్డిలాగే
రాష్ట్రంలో లక్షల మంది ఇలాంటి స్కాముల్లో చిక్కి, సొమ్ము పోగొట్టుకుని న్యాయం కోసం
ఎదురుచూస్తున్నారు. ఉచిత విద్య పేరు చెప్పి లక్షల డిపాజిట్లు
సేకరించి బోర్డు తిప్పేసిన కేశవరెడ్డిని కాపాడేందుకు పెద్ద స్థాయిలోనే పైరవీలు
నడిచాయి. అలాగే అగ్రిగోల్డు బాధితులకూ చంద్రబాబు ప్రభుత్వం న్యాయం చేయలేదు. కోర్టు
జోక్యం చేసుకుని బాధితులకు రికవరీ చేయించమని అడిగినా ఇంతవరకూ ఆ చర్యలకు అతిగతీ
లేకుండా పోయింది. అక్షయాగోల్డు వ్యవహారం కూడా అటకెక్కింది. కాల్ మనీ వ్యవహారంలో
బాధితులకు ఊరట దొరకనే లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక నేరాలన్ని వెనుకా
తెలుగు తమ్ముళ్ల హస్తం ఉండనే ఉండటమే అందుకు కారణం. ఆర్థిక నేరగాళ్లకు టిడిపి
కంచుకోటగా మారింది. నేతలు, వారి బంధువులు, బినామీలు ఇలా ఎవరికి తోచినరీతిలో వారు
ప్రజలను దోపిడీ చేస్తున్నారు. గతంలో కాల్ మనీ వ్యవహారం, ఇసుక మాఫియా, మద్యం
మాఫియా, పేదల, గిరిజనుల భూముల కబ్జాలు మొదలైనవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే.
అంతేకాదు, శ్రీచైతన్య, నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థుల మరణాలపై ఎంక్వైరీలే
లేవు. అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండటంతో పోలీసులు, అధికారులూ
బాధితుల గోడును గాలికొదిలేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రికి మెరపెట్టుకోవాలని
వచ్చిన వారిని చంద్రబాబు పురుగుల్లా చూస్తున్నాడు. కనీసం వారికి తనను కలిసే అవకాశం
కూడా ఇవ్వడం లేదు. ఆక్వా పార్కు గ్రామాల బాధితులు నెలల తరబడి నిరసనలు వ్యక్తం
చేస్తున్నా చంద్రబాబు కు చీమకుట్టినట్టైనా లేదు. పంట నష్టానికి సంబంధించి పరిహారం
రాలేదంటూ రైతులు పురుగుల మందు తాగి ఆసుపత్రి పాలైనా ముఖ్యమంత్రి కనీసం ఓ ప్రకటనైనా
చేయలేదు. ఫాతిమా కాలేజీ నిర్వాకానికి బలైపోయిన విద్యార్థులు సాయం కోరితే బెదిరించి
బైటకు గెంటారు. తమకిచ్చిన హామీలు నెరవేర్చని కోరవస్తే మత్స్యకారులను అవమానించి
పంపారు. ప్రభుత్వం సాయం చేస్తుందని, న్యాయం చేస్తుందనే నమ్మకాన్ని కూకటి వేళ్లతో
సహా పెకలించేసారు.

ఇలాంటప్పుడే కొందరు బాధితులు నాటి మహానేతను
గుర్తు చేసుకుంటున్నారు. ఏ అవసరం పడి సచివాలయానికి వచ్చినా నేరుగా ముఖ్యమంత్రిని
కలిసే అవకాశం ఉండేదని నాటి రోజులను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎవ్వరొచ్చినా
నవ్వుతూ, ప్రేమగా పలకరించే ఆ మహనీయుడి ఆత్మీయతను తలుచుకుంటున్నారు. తమ కష్టాన్ని
చెప్పుకుంటే సావధానంగా విని ఆ సమస్యను పరిష్కరించి పంపే ఉదాత్త నాయకుడి గుణాలను
నేటి పాలకుల నిర్లక్ష్యంతో పోల్చి చూసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రజలకోసమని,
నాయకుడు ప్రజల సేవకుడని వైఎస్సార్ నిరూపిస్తే, అధికారం, అహంకారం ఉన్న నాయకుడు
స్వార్థ రాజకీయనాయకుడిగా ఉండిపోతాడని చంద్రబాబు నిరూపించాడని అనుకుంటున్నారు
సచివాలయానికి వచ్చి నిరాశగా తిరిగి వెళ్లే బాధితులు.

Back to Top