అన్న పిలుపున‌కు విశేష స్పంద‌న

త‌ట‌స్థులు, మేధావుల‌తో వైయ‌స్ జ‌గ‌న్ భేటీ

స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించిన వైయ‌స్ఆర్‌సీపీ అధినేత

త్వ‌ర‌లోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్న పిలుపు కార్య‌క్ర‌మాలు

హైద‌రాబాద్‌: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన అన్న పిలుపు కార్య‌క్ర‌మానికి విశేష స్పంద‌న ల‌భించింది. మేధావులు, త‌టస్థుల‌తో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురువారం పార్టీ కేంద్ర కార్యాల‌యంలో భేటీ అయ్యారు. వారి నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకున్నారు. ఇందులో భాగంగా మొదటి సమావేశం హైదరాబాద్ లో‌ జరగ్గా, రానున్న రోజుల్లో 13 జిల్లాలోఈ సమావేశాలు నిర్వహించ‌నున్నారు.
జనవరి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో ప్రభావం చూపగల దాదాపు 60 వేల మందికి పైగా వ్య‌క్తులు వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి నుంచి వ్యక్తిగతంగా ఉత్తరాలు పొందారు. సమాజంలో వారు భాగస్వామ్యాన్ని గుర్తిస్తూ రాష్ట్ర అభివృద్ధి లో పాలు పంచుకోవాల‌ని లేఖ‌లో వైయ‌స్ జ‌గ‌న్ కోరారు. వారి సేవ‌ల‌ను ప్ర‌శంసించారు. ఈ ఉత్తరాల ద్వారా ఆయా ప్రాంతాలు, రాష్ట్ర అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వమని...తద్వారా, రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలో ఎంతగానో ఉపయోగపడుతాయని వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి కోరారు. ఉత్తరాలు పొందిన వ్యక్తులు సూచనలు ఇవ్వడానికి వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి ఆస‌క్తి చూపారు. దీంతో పార్టీ కేంద్ర కార్యాల‌యంలో వైయ‌స్ జ‌గ‌న్ స‌మావేశ‌మై ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించారు. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి పై తన విజన్ ను కార్యక్రమం లో‌ పాల్గొన్న వారితో వైయ‌స్ జ‌గ‌న్ చర్చించగా..ప్రాంతాల వారిగా సమస్యలు, వాటి పరిష్కారం పై అన్ని వర్గాల వారు ‌తమ ఆలోచనలను ‌పంచుకున్నారు. సమావేశం ముగిసే ముందు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, వివిధ సమస్యలతో పాటు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ప్రశ్నలను వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి ముందుంచారు.

త‌ట‌స్థుల ప్ర‌శ్న‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ స‌మాధానం ఇలా..

శ్రావ‌ణి, విశాఖ‌: అన్నా..యూపీఎస్సీ పరీక్షలకు సిద్దమవుతున్నాను. 2014 లో‌ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం రైల్వే జోన్ ను సాధించడానికి, కేంద్ర ప్రభుత్వం పై ఏ విధంగా పోరాటం చేయాలి.

వైయ‌స్ జగన్: మనం (వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ) 25 ఎంపీ సీట్లు గెలవడానికి ప్రయత్నించాలి. మన దగ్గర 25 మంది ఎంపీలు ఉంటే...కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, ఏ కూటమికి మన అవసరం ఉన్నా ‌.. రాష్ట్రం డిమాండ్ లను నెరవేర్చాల్సి ఉంటుంది.

ప్ర‌ణ‌య్‌, ఇంజినీర్‌: రాష్ట్రంలో ఎక్కువ ఉద్యోగాలు కల్పించడంతో పాటు, స్టార్ట్ అప్ కంపెనీల ద్వారా ఆదాయాలను పెంచుకోవడం ఎలా?

వైయ‌స్ జ‌గ‌న్‌: యువతకు స్వయం ఉపాధి ఎంతో ముఖ్యమైనది. స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలను ఎంతగానో పెంచుతుంది. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వ్యాపార అవకాశాలు ( ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) పెంచడంతో పాటు, పరిశ్రమలలో 75% ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చట్టం తీసుకొస్తాం. రాష్ట్రంలో కియా మోటర్స్ కంపెనీ ఏర్పాటు చేసినా, స్థానికులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైంది. అంతేకాదు, ప్రభుత్వ ఉద్యోగాలు ,ఇతర ఉద్యోగ అవకాశాలను మరోసారి పరిశీలించి, కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తానని హామీ ఇస్తున్నాను.

మ‌న్వితారెడ్డి: అన్నా..రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ఏ విధంగా పరిష్కరిస్తారు?

వైయ‌స్ జగన్: రైతు రుణాలను మాఫీ చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు కనీసం వడ్డీ లు కట్టడానికి కూడా సరిపోని విధంగా.. కేవలం రూ.4000 కోట్లు మాత్రమే విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్న 85 లక్షల రైతులకు వారి సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే విధంగా రూ. 12,500 ఇస్తామని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మేము అమలుచేసే వాటినే హామీలుగా ‌ఇస్తున్నాము. అమలు చేయకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతాము. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చి, తద్వారా ప్రతి కుటుంబం వాళ్ల ఇంట్లో నాన్న గారి ఫొటో పక్కన నా ఫొటో కూడా పెట్టుకుంటారని విశ్వాసిస్తున్నా. ఇంత కంటే ఇంకే కావాలి?

Back to Top