ఎంవోయూలన్నీ ప‌చ్చి మోసం

 -ప్ర‌భుత్వ జీవోల వెనుక‌ భారీ కుంభకోణం 
- టీడీపీ ఎన్నారైల గొడ‌వ‌తో వెలుగులోకి
- వైయ‌స్ఆర్‌సీపీకి అంట‌గ‌ట్టేందుకు ఆంధ్ర‌జ్యోతి త‌ప్ప‌డు క‌థ‌నం
- బ‌య‌ట‌ప‌డుతున్న చంద్ర‌బాబు అస‌లు రంగు

ఎంఓయూల‌తో రాష్ట్రానికి వేల కోట్లు పెట్టుబ‌డులు తీసుకొచ్చామ‌ని డ‌ప్పు వాయించుకుంటున్న చంద్ర‌బాబు మాట‌ల‌న్నీ అబ‌ద్ద‌పు ప్ర‌చారమ‌ని ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌ప‌డింది.  ఉత్తుత్తి జీవోల‌తో అక్క‌డ చంద్ర‌బాబు ఒప్పందాలు చేసుకుంటుంటే ఇక్క‌డ ప‌చ్చ ప‌త్రిక‌లు హ‌ల్ చ‌ల్  చేయ‌డం జ‌నం న‌మ్మేయ‌డం జ‌రిగిపోయింది. కానీ ఇప్ప‌డు ప‌రిస్థితులు మారిపోయాయి. బాబు మాట‌ల‌న్నీ డాబుల‌ని తేలిపోయింది. జ‌నాన్ని మోసం చేయ‌డానికి ప‌థ‌కం ప్ర‌కారం ఆడుతున్న డ్రామా అని సోష‌ల్ మీడియా పుణ్య‌మాని ఇప్ప‌డిప్ప‌డే ప్ర‌పంచానికి తెలుస్తుంది. మేక‌వ‌న్నె పులిలా బాహ్య ప్ర‌పంచానికి బిల్డ‌ప్ ఇస్తున్న చంద్ర‌బాబు అస‌లు రంగు బ‌య‌ట ప‌డుతుంది. దేశంలోనే అవినీతిలో నంబర్ వన్ స్థానం సంపాదించిన చంద్రబాబు ప్రభుత్వం..దాన్ని నిలుపుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుత అమెరికా పర్యటన ద్వారా రాష్ట్రానికి ఎన్నో పెద్ద కంపెనీలని తీసుకొస్తాడని ఆశలు పెట్టుకొన్న ప్రజలని తీవ్ర నిరాశలో ముంచటమే కాకుండా సరికొత్త కుంభకోణానికి తెరలేపాడు .

ప్రతిసారీ రాజధాని మోడల్స్ డిజైన్స్ చూడటానికి విదేశాలు వెళ్లే బాబు ఈసారి ఎంఓయూల పేరుతొ అమెరికాలో పర్యటిస్తున్నాడు . అసలు అమెరికా పర్యటనలో ఏమి జరుగుతుందో ఒక్కసారి పరిశీలిద్దాం .
- G.O.RT.No.949 ఇది బాబు అమెరికా పర్యటన కోసం విడుదల చేసిన జీవో , ఇది ఏప్రిల్ 28న విడుదల చేశారు . ఈ జీవో ప్రకారం చంద్రబాబు పర్యటించే నగరాలు - కాలిఫోర్నియా, శాన్‌జోన్స్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, చికాగో, వాషింగ్ట‌న్ డీసీ, న్యూయార్క్‌, న్యూజెర్సీ. అమెరికా పర్యటించే బృందంలో చంద్రబాబు, లోకేష్ తోపాటుగా మొత్తం 17 మంది పేర్లు కూడా ఇచ్చారు .
 - G.O.RT.No.976 ఈజీవోని ఈనెల రెండున ఇచ్చారు , దీనిలో లోకేష్ మరియు CS పేర్లు తప్పించి 15 మంది సభ్యులు బృందం మొదటి జీవోలో పేర్కొన్న నగరాలలోని పర్యటిస్తుందని పేర్కొన్నారు .

డల్లాస్ లో గొడవ బూతు జ్యోతి కథ‌నం 
అమెరికా పర్యటన కోసం ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన పైరెండు జీవోలలో డల్లాస్ నగరం లేదు . ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం డల్లాస్ లో టీడీపీ ప్రోగ్రాం కాబట్టి దానికి చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగా హాజరవుతున్నాడు కాబట్టి డల్లాస్ ని జీవోలో చేర్చలేదు . 
ప్రభుత్వ వాదన ప్రకారం డల్లాస్ లో ఎంఓయూల సంతకాల ప్రోగ్రాం లేదు . ఇది కేవలం పూర్తిగా చంద్రబాబు పార్టీ ప్రోగ్రాం . 
కానీ ఇక్కడే చంద్రబాబు మార్క్ రాజకీయానికి తెరదీసాడు . పార్టీ ప్రోగ్రాంకి డల్లాస్ వచ్చిన చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా ఎంఓయూల ప్రహసనానికి తెరలేపాడు . డల్లాస్‌లో జరిగిన ఎంఓయూలలో ఎక్కడా అమెరికన్ కంపెనీల జాడలేదు . ఇది అంతా తెలుగుతమ్ముళ్లకి ఎంఓయూ ల పేరుతొ దోచిపెట్టటానికి జరిగిన ప్రోగ్రాం మాత్రమే .

గొడ‌వ చేస్తార‌ని అమెరికా ప‌ర్య‌ట‌న నుంచి లోకేష్‌కు ఉద్వాస‌న‌ 
అసలు చంద్రబాబు ప్రోగ్రాం మొత్తం APNRT అనే సంస్థకి అప్పగించారు . దానికి అధిపతి లోకేష్ కి స్నేహితుడయిన వేమూరి రవి . అతను ఈప్రోగ్రామ్ మొత్తం తన ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నాడని అన్నీ ఫేక్ కంపెనీలని సృష్టించి అమరావతిలో స్థలాలు కోసం ఇంకా ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు కోసం ఎంఓయూల తంతంగం నడుపుతున్నాడని అసలైన కార్యకర్తలకి ఏమీ దక్కటంలేదని టీడీపీ కి చెందిన NRI లు గత 20 రోజులుగా వేమూరి రవి వర్గంతో గొడవలు పడుతున్నారు . అంతే కాకుండా APNRT లో భాగస్వామ్యం వుండి ఎంఓయూ లు కుదుర్చుకోబోయే కంపెనీల మీద TDP NRI విభాగమే అమెరికన్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది . అంతేకాకుండా TDP NRI విభాగానికి ప్రాధాన్యత దక్కకపోతే చంద్రబాబు ముందే నిరసన తెలపాలనే నిర్ణయం కూడా జరిగింది . వేమూరి రవి లోకేష్ కి స్నేహితుడు కావటంతో డల్లాస్ లో లోకేష్ ని ఘోరావ్ చేయాలని నిర్ణయించటంతో, అదే రోజున పర్యటన నుండి లోకేష్ ని తప్పించటం జరిగింది .

ఇలా ఈ గొడవంతా అమరావతిలో ఉచితంగా రాబోయే స్థలాల కోసం , ఇంకా అనేక రకాల బెనిఫిట్స్ కోసం వాళ్లలో వాళ్లకి వాటాలు కుదరక జరిగిన రచ్చ. ఈ గొడవ అంతా ఎక్కడ బయటకి వస్తుందోనని,  పైపెచ్చు పార్టీ ప్రోగ్రాంలో ఎంఓయూలు కుదుర్చుకోవటమేమిటనే విమర్శలు వస్తాయని ముందుగానే ఊహించిన అపర మేధావి చంద్రబాబు , తన ఆస్థాన బూతు జ్యోతితో ఒక కట్టుకథని అల్లి దానిని వైసీపీ మీదకి మళ్లించి ప్రజల దృష్టిని ఎంఓయూ ల నుండి మళ్లించే ప్రయత్నం చేసాడు .

అస‌లు గొడ‌వే జ‌ర‌గ‌లేదు..
అదే రోజు డల్లాస్‌లో అదే ప్రదేశంలో లోకల్ ఎన్నిక జరుగుతుండటంతో అక్కడ ఎన్నికల కోసం పోలీసులు ఉండటం జరిగింది . ఆ పోలీసులకి చంద్రబాబు మీటింగ్ కి ఎటువంటి సంభంధం లేదు . పోలీసులు మీటింగ్ వైపు కనీసం తొంగి కూడా చూడలేదు . అసలు అక్కడ ఎలాంటి గొడవ జరగలేదు . బూతు జ్యోతి లో వచ్చిన వార్తలు చూసి టీడీపీ డల్లాస్ మిత్రులే ఆశ్చర్యపోయారు .

- వేమూరి రవికి , లోకేష్ కి వ్యతిరేకంగ ధర్నా చేయబోతున్నారనే వార్త . ఇది రెండో తారీఖున వచ్చింది , ఒకవేళ అదే జరిగితే అదే రోజు సాయంత్రానికి పరువుపోతుందనే ఉద్దేశ్యంతో లోకేష్‌ని అమెరికా ట్రిప్ నుండి తప్పిస్తూ జీవో జారీ చేయటం జరిగింది .
- నాలుగో తారీఖున టీడీపీలోని వేమూరి వ్యతిరేక వర్గం ఇచ్చిన పిర్యాదు మేరకు అమెరికా ప్రభుత్వం ఎంఓయూల కోసం సృష్టించిన ఫేక్ కంపెనీల మీద దాడిచేసి రికార్డులని స్వాధీనం చేసుకోవటం జరిగింది .

- మే 8న‌ టీడీపీ NRI సభ్యులు వేమూరి రవి ఆధ్వర్యంలోని APNRT మీద పైచేయి సాధిస్తూ వాళ్ళ కంటే వీళ్ళే ఎక్కువ ఎంఓయూలు చేసుకొన్నట్లు వచ్చిన వార్త .
- టీడీపీలో ఉన్న రెండు వర్గాలు ఒకరినొకరు తిట్టుకొంటూ సోషల్ మీడియాలో చేసిన రచ్చ చూడోచ్చు . దానిలో మీవి ఫేకు కంపెనీలంటే కాదు మీవే ఫేకు కంపెనీలని దుమ్మెత్తిపోసుకోవటం చూడోచ్చు .
- ఇది అంతా గమనిస్తే నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఒప్పందాలని , అక్కడ వాళ్లలో వాళ్లకి జరిగిన గొడవని కప్పిపుచ్చుకోవటానికి తప్పుడు పనులు చేయటంలో ఆరితేరిన బూతు జ్యోతి కథనంలో భాగంగానే నిన్న వైయస్సార్సీపీ మీద బురదజల్లుతూ అల్లిన కట్టుకథ .

ప్రభుత్వ ప్రోత్సాహకాలు - జీవోలు - అసలు కుంభకోణం 

గత రెండు సంవత్సరాలుగా పెట్టుబడులు ఎంఓయూలు అంటూ లేని కంపెనీలని సృష్టించి , సొంతమనుషులతోనే తప్పుడు ఎంఓయూలు చేపిస్తూ గతేడాది 6 లక్షల కోట్లని , ఈఏడాది వైజాగ్లో 10 లక్షల కోట్లని ఎందుకు హడావుడి చేస్తున్నారు . దానివెనుక ఉన్న అసలు నిజాలు తెలిస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే .

 IT రంగంలో ప్రభుత్వ ప్రోత్సాహాకాలు ఎలా ఉండాలో , కంపెనీలకి ఉండాల్సిన అర్హతలు ఏమిటో వివరిస్తూ ఈ రెండు జీవోలు విడుదల చేశారు .
***ఫోటోలు 18 నుండి 24 వరకు ****
G.O.MS.No.3 తేదీ - 16.03.2016 
GO.Ms.No.13 తేదీ - 11.08.2014 
GO.Ms.No.16. తేదీ - 09.09.2014
ఈ మొత్తం కుంభకోణానికి మూలాధారం ఈ జీవోలు . టీడీపీలోని గల్లీ నాయుకుడి నుండి మంత్రుల వరకు , అనకాపల్లి నుండి అమెరికా దాకా ప్రతి పచ్చ కార్యకర్త ఎంఓయూ ల కోసం ఎగబడటం వెనుక ఉన్న అసలు కథ తెలియాలంటే ఈ జీవోలని క్షుణ్ణంగా పరిశీలించాలి .
ఈ జీవోల ప్రకారం ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీలకి దక్కబోయే ప్రోత్సాహకాలు ఒక్కసారి చూడండి .
1 . కంపెనీలో ఎంత మంది ఉద్యోగులు ఉంటే అంతమందికి ఒక్కో ఉద్యోగికి 1 లక్షా 75 వేలు చొప్పున ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తే అంతమొత్తం కంపెనీకి ప్రభుత్వం చెల్లిస్తుంది. అనగా మనం ఒక చిన్న కంపెనీ పెట్టి దానిలో పదిమందికి ఉద్యోగం ఇచ్చినట్లు చూపెడితే ప్రభుత్వం మనకి ప్రోత్సాహకం రూపంలో 17 లక్షలు చెల్లిస్తుంది .
2 . వందమందికి ఉద్యోగాలు ఇస్తామని చూపెడితే ఆ కంపెనీకి ప్రభుత్వం ఎకరం పొలం ఇస్తుంది . దానిలో 3 సవత్సరాల‌లో నిర్మాణం పూర్తి చేసుకొని 100 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి .
ఈ మూడు సంవత్సరాలు నీ కంపెనీని ప్రైవేట్ భవనంలో నడుపుకుంటే కంపెనీ కి సంవత్సరానికి అద్దె తాలూకు ప్రభుత్వమే 10 లక్షలు ప్రోత్సాహకం రూపంలో ఇస్తుంది .
3 . కంపెనీకి అవసరమయ్యే బ్యాండ్ విడ్త్ , ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం సంవత్సరానికి మరో 15 లక్షలు ఇస్తుంది .
4 . కంపెనీకి అవసరమయ్యే కరెంటు ని ఒక్కో యూనిట్ కేవలం రూపాయికే ఇస్తుంది .
5 . కంపెనీ కనుక పేటెంట్ ఫైల్ చేస్తే దానికి మరో 5 లక్షల ప్రోత్సాహకం .
6 . కంపెనీలో పదిమందికి ఉద్యోగం ఇచ్చాక వాళ్లకి స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక్కో ఉద్యోగికి 10 వేలు ప్రభుత్వమే ఇస్తుంది .
7 . ఎలక్ట్రిసిటీ డ్యూటీ 100 % ఫ్రీ .
8 . స్టాంప్ డ్యూటీ , రిజిస్ట్రేషన్ ఫీజు 100 % ఫ్రీ .
9 . కంపెనీకి కేవలం పావలా వడ్డీకే కోటి రూపాయలు లోన్ కూడా ప్రభుత్వమే ఇస్తుంది . 
10 . కాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ( బిల్డింగ్ ప్లాన్ , మెషినరీ ) కోసం ఖర్చు చేసే దానిలో 10 % ప్రభుత్వమే తిరిగి కంపెనీకి ఇస్తుంది .
11 . వ్యాట్ , CST,GST, ఇంకా అనేకరకాల టాక్స్ లు 100 % ప్రీ .
ఇలా ఎన్నో రకాలుగా కొన్ని కోట్ల రూపాయలని ప్రోత్సాహకాలు పేరుతొ తెలుగు తమ్ముళ్ళకి దోచిపెట్టటానికే ఈ ఎంఓయూల నాటకానికి తెరలేపారు .
- GO.MS.No.21 - పైన పేర్కొన్న ప్రోత్సాహాకాలకి మరిన్ని అదనంగా జతచేస్తూ అంతకుముందు ఇచ్చిన జీవోలపై అమెండ్ మెంట్ జీవో , దీనిలో ఎలాంటి కంపెనీకి ఎన్ని ఎకరాల భూములు ఇవ్వాలో పేర్కొన్నారు .
ఈ కంపెనీలు ఎక్కడ ఉండవు , కొత్తగా ఉద్యోగాలు ఎవ్వరికీ ఇవ్వరు . ఎదో ఒక పేరుతొ కంపెనీని రిజిస్టర్ చేయటం దానిలో ఉద్యోగస్థులుగా సొంత కుటుంబ సభ్యుల పేర్లు రాసుకోవటం , అవసరమయితే ఎక్కడో ఒక చిన్న గది అద్దెకు తీసుకోవటం దానిలో పనికిరాని 10 కంప్యూటర్లు పెట్టటం . అవన్నీ చూపెట్టి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చామని , 100 మందికి ఇచ్చామని , 1000 మందికి ఇచ్చామని నీ స్థోమతని బట్టి తెలుగుదేశంలో నీకున్న విలువని బట్టి , లోకేష్ తో నీకున్న సంబంధాలని బట్టి పైన పేర్కొన్న కోట్ల రూపాయల్ని ప్రోత్సాహక రూపంలో దోచుకోవచ్చు .
కేవలం ఈ మూడు సంవత్సరాలలోనే చంద్రబాబు ప్రభుత్వం 70 వేల కోట్లు అప్పు చేసింది . ఎక్కడా కోటి రూపాయల విలువగల పనికూడా చేయలేదు , అంతేకాదు ఎవ్వరికీ కనీసం ప్యూన్ ఉద్యోగం కూడా ఇవ్వలేదు . మొత్తం డబ్బంతా ఇలాంటి కుంభకోణాలకే పోతుంది .
ఇదీ అనకాపల్లి నుండి అమెరికా దాకా జరుగుతున్న ఎంఓయూల తంతు .

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top