ఆర్థిక నేరస్తుల‌కు అడ్డ‌..టీడీపీ గ‌డ్డా

– మెజారిటీ టీడీపీ ఎంపీలకు బ్యాంకు నోటీసులు
– సుజనా, గల్లా, సీఎం రమేశ్‌ సహా పలువురిపై ఆరోపణలు
– వాకాటి, దీపక్‌రెడ్డి సంగతిని మరిచి చంద్రబాబు విసుర్లు
– గంటా భండారం, బోండా దందాలు.. కాల్‌మనీ వేధింపులు టీడీపీ పుణ్యమే



సూది కోసం సోదికి పోతే పాత రంకు బయటపడిందని సామెత.. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఆర్థిక నేరస్తుడని విమర్శించి టీడీపీ భారీ మూల్యం చెల్లించుకుంది. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు తన కొంపకు తానే నిప్పుపెట్టుకున్నట్టయింది. టీడీపీలో ఉన్నంత మంది ఆర్థిక నేరస్తులు మరే పార్టీలో లేరనేది చంద్రబాబుతో సహా తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయం. గురిగింజ నీతి మాదిరిగా చంద్రబాబు కనీసం జ్ఙానాన్ని మరిచి చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడు తననానికి నిదర్శనం. మారిషస్‌ బ్యాంకులో అప్పులు తీసుకుని మోసగించిన కేసులో నిన్నటి దాకా కేంద్ర మంత్రి వర్గంలో కొనసాగిన సుజన చౌదరి నిందితుడు. ఆయనపై కోర్టులు వారంట్‌లు కూడా జారీచేశాయి. ఇప్పుడవన్నీ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆయనతోపాటు సీఎం రమేశ్‌ సంగతి తెలిసిందే. టీడీపీ అనుకూల మీడియాలోనే ఆయనపై అవినీతి వార్తలు గుప్పుమన్నాయి. ప్రాజెక్టులు దక్కించుకోవడానికి చేస్తున్న లాబీయింగ్‌.. బిల్లుల్లో అవకతవకలు తదితర విషయాల్లో అనుకూల మీడియా ఆయన్ను ఏకేసింది. మరో ఎంపీ రాయపాటి సాంబశివరావు సంగతి సరేసరి. పోలవరం కాంట్రాక్టుల్లో డొల్లతనంపై స్వయంగా చంద్రబాబే కేంద్రానికి ఫిర్యాదు చేశాడు. గల్లా జయదేవ్‌పైనా ఆర్థిక నేరస్తుడిగా కేసులున్నాయి. వారితోపాటు టీడీపీ ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, దీపక్‌ రెడ్డిలపై అరెస్టు వారంట్లు జారీ అయ్యాయి. మరో ఎంపీ మురళీ మోహన్‌పై కూడా ఉన్న ఆరోపణలు తక్కువేం కాదు. నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కొరుగొండ్ల రామకృష్ణ లంచాల బాగోతం అప్పట్లో సంచలనం అయ్యింది. వియజవాడకు చెందిన మరో ఎమ్మెల్యే బోండా ఉమ కబ్జాల బాగోతం, గంటా శ్రీనివాసరావు బ్యాంకుల నుంచి అందుకున్న నోటీసులు, చంద్రబాబు తనయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్‌పై కమీషన్ల ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. విజయవాడలో వెలుగుచూసిన కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లో వెలుగు చూసిన వాస్తవాలు టీడీపీ నాయకులకు నిద్రలు లేకుండా చేశాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు దగ్గర్నుంచి టీడీపీలో ఉన్న చోటా మోటా నాయకుడు వరకు చాలా మందికి ఆర్థిక పరమైన నేరాల్లో భాగస్వామ్యం ఉంది. ఇదంతా తెలియనట్టు తామేద్దు శుద్ధపూసల్లాగా బిల్డప్‌ ఇవ్వాలని చూసి చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యాడు. 


ఇప్పుడే ఎందుకిలా చేస్తున్నారు..
వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద బనాయించిన అక్రమ కేసులు ఒక్కొక్కటిగా వీడిపోవడం తట్టుకోలేక టీడీపీ మైండ్‌ గేమ్‌ను షురూ చేసింది. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డిని లక్ష్యంగా ఆరోపణలను సంధించడం మొదలు పెట్టింది. తద్వారా జగన్‌ను.. అట్నుంచి వైయస్‌ఆర్‌సీపీని అధికారంలోకి రాకుండా ఎల్లో మీడియాలో ప్రచారం దంచేయాలనేది వారి ఎత్తుగడ. దాంతోపాటు ఒకవైపు ప్రత్యేక హోదా ఉద్యమం క్లైమాక్స్‌కు చేరిన నేపథ్యంలో దాన్ని ఎలాగైనా పక్కదారి పట్టించడానికి పనికిరాని విషయాలతో మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. తెలుగు దేశం నాయకులు తుమ్మినా దగ్గినా హడావుడి చేయడానికి అనుకూల మీడియా ఎలాగూ ఉండనే ఉంది.. 2014 ఎన్నికలకు ముందు మాదిరిగా ఇప్పట్నుంచే ప్రచారం ఊపు చేసి మళ్లీ లబ్ధిపొందాలని టీడీపీ వేసిన ఎత్తుగడ ఇది. 
 

Back to Top