ప్రణబ్‌ ముఖర్జీకి ‘భారతరత్న’ ఆనందం కలిగించింది

వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌

తెలుగు వారు పద్మ పురస్కారాలు పొందడం హర్షణీయం

అమరావతి:  భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌కుమార్‌ ముఖర్జీకి భారత రత్న అవార్డు లభించడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు ప్రకటించిన వెంటనే ఓ ప్రకటనలో వైయస్‌ జగన్‌ స్పందిస్తూ ప్రణబ్‌ ముఖర్జీ ఈ అవార్డుకు అన్ని విధాలా తగిన వాడని వ్యాఖ్యానించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రణబ్‌ ముఖర్జీ మంచి రాజనీతిజ్ఞతను ప్రదర్శించారని పేర్కొన్నారు. భారత ప్రజాస్యామ్యంలో ఎన్నో ఒడిదుడుకులను, రాజకీయాల్లో ఉదారమైన, గర్వించదగిన ఘటనలకు సాక్షి అయిన ప్రణబ్‌ ఏమాత్రం తొట్రుపాటు లేకుండా వాటన్నిటినీ ఎదుర్కొన్నారని వైయస్‌ జగన్‌ ప్రశంసించారు. అలాగే ప్రఖ్యాత గాయకుడు భూపేన్‌ హజారికా, ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త నానాజీ దేశ్‌ముఖ్‌కు మరణానంతరం భారత రత్న గౌరవం దక్కడంపై వైయస్‌ జగన్‌ సంతోషం వ్యక్తం చేశారు. పద్మ పురస్కారాలను పొందిన తెలుగువారందరికీ మరో ప్రకటనలో వైయస్‌ జగన్‌ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 

 

Back to Top