వైయస్‌ఆర్‌సిపి టియు సెల్‌ కన్వీనర్ల నియామకం

హైదరాబాద్‌, 12 నవంబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాల పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ సెల్‌ కన్వీనర్లను నియమించినట్లు పార్టీ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షుడు బి. జనక్‌ ప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్‌ జిల్లాకు తక్కల్లపల్లి మోహన్‌రావును, ఒంగోలు సిటీ ట్రేడ్‌ యూనియన్‌ సెల్‌ కన్వీనర్‌గా ముదవర్తి బాబూరావును, తూర్పు గోదావరి జిల్లాకు అడపా వెంకటరమణ (గెడ్డం రమణ)ను, హైదరాబాద్‌ సిటీ సెల్‌ కన్వీనర్‌గా శివకుమార్‌ను, విశాఖపట్టణం రూరల్‌ జిల్లా‌ ట్రేడ్‌ యూనియన్ సెల్‌ కన్వీనర్‌గా మస్తానప్పను నియమించినట్లు జనక్‌ ప్రసాద్‌ ఆ ప్రకటనలో వివరించారు.
Back to Top