స్పీకర్‌: శ్రీమతి వాసిరెడ్డిపద్మ-మే15,2012

స్పీకర్‌: శ్రీమతి వాసిరెడ్డిపద్మ, అధికార ప్రతినిధి

చిరంజీవిగారి అల్లుడి ఇంట్లో దొరికిన నోట్లకట్టలు దాదాపు 39 కోట్లు రూపాయలను కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కాంగ్రెస్‌లో విలీనం అయిననాయకులు అ విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేయలనుకుంటున్నారు. చిరంజీవిగారునాకు సంబందంలేదని అనడం నీతిమాలిన చర్య. ప్రజాజీవితంలో ఉన్నప్పుడు తమ పై వచ్చిన ఆరోపణలను నిరూపించుకునే భాద్యత చిరంజీవి పై ఉంది. ప్రజారాజ్యం పార్టీని గంపగుత్తగా కాంగ్రెస్‌కు అమ్మినప్పుడు, కాంగ్రెస్‌ పార్టీని పడగొడితే నిలబెడతా అన్నప్పుడు మీకు క్యిక్‌ప్రోకో క్రింద బహుమతులు ఏమి అందాయి.నగదు రూపంలో గాకుండా ఇంకా ఏ రూపాన మీకు అందాయి మీ మద్య జరిగిన రహస్య ఉప్పందం బయటపెట్టాలి. తిరుపతిని వదిలి రాజ్యసభకు వెళ్ళడం కాంగ్రెస్‌లో కలిసినందుకు మీకు క్యిట్‌ప్రోకో గా మీక దక్కినది ఎంతా.
ఇది ఖచ్చితంగా క్యిట్‌ప్రోకోనే ఇలాంటి క్యిట్‌ ప్రోకోలు ఎన్ని ఉన్నాయి.10 జన్‌పధ్‌లో సోనియాగాంధీని కలిసి ప్రజారాజ్యం పార్టీని పేరు మార్చినప్పుడే ప్రజల్లో అనుమానాలు మోలకెత్తాయి. చెెనైలో మీ వియంకులవారి వ్యాపారాల సంగతివారిగురించి ప్రజలకు తెలియంది కాదు వారు అంతా 39 కోట్లు రూపాయలు ఇంట్లో పెట్టుకునే సంపన్నులు కాదు. అసలు ప్రజారాజ్యం కాంగ్రెస్‌ మధ్య జరిగిన ఒప్పందం ఏంటి? ఈ విషయంలో చిరంజీవిగారు సీబీఐ విచారణకు సిిద్దపడాలి.కాంగ్రెస్‌ప్రభుత్వం విచారణ జరిపించాలి.చిరంజీవి గారి అల్లుడి ఇంట్లో అంతా డబ్బుదొరికతే అది న్యూస్‌ కాదా... అదే బాను కిరణతో రాజశేఖరరెడ్డిగారి తోడల్లుడుకి లింకులు ఉన్నాయని ఈనాడు పేపర్‌లో మెయిన్‌ పేజిలో హైలెట్‌ చేసారు.ఈ రోజు మీడియా పక్షపాత దోరణిగా వ్యవహరిస్తుంది.
భానుతో జయభేరి మురళిమోహన్‌ కి రియల్‌ఎస్టేట్‌ సంబాందాలు ఉన్నాయంటే, సీఐడి విచారించదు పత్రికలుగాని మీడియాగాని స్పందించరు. అదే రాజశేఖరరెడ్డిగారి విషయంలో ఏ చిన్న విషయం జరిగినా దాన్ని బేనర్‌ ఐటంగా ఇస్తారు. అదే 39 కోట్లు పట్టుపడితే మీకు అది వార్తకాదు దానికి సంభందించి దాన్ని వెలుగులోకి తేవడానికి ప్రయత్నం చేయరు.మీరు ప్రతిరోజు నీతులు చెబితే ప్రజలు నోట్లో వేలేసుకుని చూడాలా.....ఈ రోజు సాక్షిలేకపోతే చిరంజీవిగారింట్లో డబ్బు సంగతి తెలిసేదేకాదు ఈ రాష్ట్ర ప్రజలకి....
ఢిల్లీ లో రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జి వాయిలార్‌ రవిగారిని ఎందుకు కలిసావు. ఐటి శాఖ మీద తీవ్రమైన ఒత్తిడి తేవాడానికేనా? చిరంజీవి నడిరోడ్డు మీద ప్రజారాజ్యంపార్టీ అమ్ముకున్నారని ప్రజారాజ్యం శ్రేణులే అంటున్నారు. పరువునష్టం దావావేస్తామని చిరంజీవి అంటున్నారు ఎంత మంది మీద పరువునష్టం దావావేస్తారు తిరుపతి ప్రజలందరి మీద పరువునష్టం దావా వేస్తారా...

Back to Top