స్పీకర్‌ : అంబటిరాంబాబు - మే 25,2012

జగన్‌మోహన్‌రెడ్డి గారికి సీబీఐ నోటిసులిచ్చిన తర్వాత సీబీఐ ముందు హజరవడం జరిగింది విచారణ జరుగుతుంది.రాష్ట్ర వ్యాప్తంగా  వైయస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల పై బైండోవర్‌  కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. హైదారాబాద్‌ లో బారికేట్లు పెట్టి సామాన్య  జనం రాకుండా అడ్డుకుంటున్నారు. ఎందుకు ఈ విధమైన ఓవరాక్షన్‌ పోలిసు యంత్రాంగం చేస్తుంది. జగన్‌మోహన్‌ రెడ్డి అభిమానులని  పోలిసు యంత్రాంగాన్ని పెట్టి భయపెట్టాలని చూస్తున్నారా అని అడుగుతున్నాం. శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్దతిలో ఏ విషయాన్ని అయిన ఎదుర్కోడానికి సిద్దంగా ఉన్నాం అని తెలియచేస్తున్నాం.ఏ నాయుకుడికి లేనంతా ప్రజాదరణ జగన్‌మోహన్‌రెడ్డి గారికి ఉంది.రేపు జరగబోయే 18 ఉప ఎన్నికల్లో కూడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండమెజార్టితో గెలుస్తుంది.రాష్ట్ర రాజకీయాల్లో అనేక పదవులు అలంకరించిన వ్యక్తి మైసూరరెడ్డి గారు కాంగ్రెస్‌ లో పనిచేసిన వ్యక్తి అలాగే తెలుగుదేశం పార్టీలో కొనసాగిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి గారి మీద పోటిచేసినటువంటి వ్యక్తి ఈరోజు లోటస్‌ పాండ్‌కు వచ్చిజగన్‌మోహన్‌ రెడ్డి గారికి సంఘీవభావం ప్రకటించారు. ఆళ్ళనాని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అయినా జగన్‌మోహన్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించడానికి వచ్చారు విజయమ్మగారి మీద పోటిచేసిన వైయస్‌ వివేకనందారెడ్డి గారుకూడ కాంగ్రెస్‌ వీడి జగన్‌మోహన్‌ రెడ్డిగారికి మద్దతు ప్రకటించారు. జగన్‌మోహన్‌ రెడ్డి గారిని అరెస్ట్‌ కాబోతున్నారని  వారు అంటున్నారు అరెస్ట్‌ అయ్యే అవకాశం ఉందని మేము ఒప్పుకుంటున్నాం. ఇలాంటి సమయంలో కూడ వారు  జగన్‌మోహన్‌ రెడ్డి గారికి మద్దతు పలకడం చూస్తుంటే జరుగుతున్నది అన్యాయం అక్రమం అని ప్రజలు తెలుసుకుంటున్నారు. ప్రజల్లో ఎంత బలం ఉందో తెలుసుకోవాలి, ప్రజలు ఎంతో ఆవేదనకు గురిఅవుతున్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి ని తక్కువ అంచనావేయకండి అని నేను మనవి చేస్తున్నా.పోలీసులు లారా ప్రజలును రెచ్చగోట్టవద్దు,రెచ్చగోట్టి ఆ నెపం మామీద నెట్టకండి. దానికి భాద్యత వహించల్చింది మీరు లేక మీ ప్రభుత్వం. రాజశేఖరరెడ్డి గారు చనిపోయారు కాబట్టి ఆయన మీద బురద చల్లిడానికి కిరణ్‌కుమార్‌ రెడ్డి అలాగే చంద్రబాబునాయుడు కలిసి అడినటువంటి నాటకంలో మోపిదేవిని బలిపశువును చేసారు. సీబీఐ చెప్పిన ప్రకారం మంత్రిగారు నోరు మెదపలేదు అని చెప్తే లెటర్‌ లో మాత్రం నాకు ఎమి సంభందంలేదు అంతా రాజశేఖరరెడ్డి గారు చెప్పినట్టుచేసాను అని నోట్‌ ఫైల్‌ కూడ నా ఆఫీస్‌కు రాలేదు అని లెటర్‌లో ఉంది. సీబీఐ కి మాత్రం ఎమి చెప్పలేదు అని ఉంది లెటర్‌ లో మాత్రం అన్ని  రాజశేఖర్‌రెడ్డి గారు చేయమన్నారు అని
ఉంది ఇదంతా కిరణ్‌కుమార్‌ రెడ్డి కుట్ర....ప్రజలు తగిన బుద్దిచెబుతారు. జగన్‌మోహన్‌ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్‌ చేస్తారని అని అడుగుతున్నారు. అసలు జగన్‌మోహన్‌ రెడ్డిని ఈ రోజు అరెస్ట్‌చేయరు.ఎంకుకంటే రేపు ఈనాడు,ఆంధ్రజ్యోతి పేపర్లుకి హెడ్‌ లైన్సకివార్తలుండవు కాబట్టి ఈ రోజు అరెష్ట్‌చేయరు. బోత్స సత్యనారాయణ, సోనియాగాంధీ మిగతా నాయకులు కలిసి జగన్‌మోహన్‌ రెడ్డి అరెస్ట్‌ చేయాలని అనుకునే ఇదంతా చేస్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు సమాదానం చెప్పాలి 26 జీఒల మీద ఎందుకు కౌంటర్‌ దాఖలు చేయలేదు. స్యయంకృతాపరాదం చేసుకున్నది ప్రభుత్వమే. జగన్‌మోహన్‌ రెడ్డి క్రిమినల్‌ కాదు రౌడికాదు ప్రజలు మెచ్చిన నాయకుడు. ఆయన్ని చూసి మీకు వెన్నులో వణుకుపుడుతుంది.ప్రజలు చీదరించుకుని అసహ్యించుకుంటున్నారనే సంగతి తెలియడానికి కొంచెం సమయం పట్టవచ్చు. ఈ రాక్షసకృత్యానికి స్సందించని నాయకుడు ఉండడు భవిష్యత్‌ లో ప్రజలందరు జగన్‌మోహన్‌ రెడ్డి వెంట నడుస్తారు.
Back to Top