సీబీఐ చార్జిషీట్ పెద్ద ఫ్రాడ్ ..మార్చి౩౦,2012

ఆస్తుల కేసులో సీబీఐ ఇవాళ నాంపల్లి కోర్టులో .. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ని ఏ-1 గా పేర్కొంటూ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పెద్ద ఫ్రాడ్ గా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతుంది. ఈ కేసులో ఏ-1 గా పేర్కొన్న జగన్మోహన్ రెడ్డి తొ ఒక్క మాట ఐన  సీబీఐ మాట్లాడిందా..? ఎటువంటి విచారణ చేయకుండా .. చార్జిషీట్ ఎలా దాఖలు చేస్తారని పార్టీ సీనియర్ నేత సోమయాజులు శనివారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయం లో జరిగిన మీడియా సమావేశం లో ప్రశ్నించారు.

ఇండియన్ పీనల్ కోడ్ కనీస నిబందనలు పాటించకుండా సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ కచ్చితంగా కోర్టు దిక్కారానికే వస్తుందని... దీని పై  న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని చెప్పారు.

ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాం లో .. ప్రభుత్వం జారి చేసిన 26 జీ.ఓ.లకు సంబందించిన ఈ కేసు లో .. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు,తెలుగుదేశం నేత ఎర్రన్నాయుడు హైకోర్టులో వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తే .. వారిచ్చిన పిర్యాదులో .. మొదటినిందితుల జాబితాలో ... ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ తొ పాటు ఆయా శాఖల ఐ ఐఏయస్ అధికారులు.. జీ.ఓ.లు జారి చేసిన నాటి మంత్రుల పేర్లు ఉంటె .. వాటన్నిటినీ పక్కన పెట్టి .. వారిని విచారించకుండా .. ఎక్కడో 52 వ పేరుగా ఉన్నజగన్మోహన్ రెడ్డి ని ఈ కేసులో ఏ-1 గా ఎలా పెడతారు..?
ఇదీ కేసులో సుప్రీంకోర్టు ఆరుగురు మంత్రులకు ..ఎనిమిది ఐఏయస్ అధికారులకు  నోటీసులు నిన్న అందినప్పుడు .. వారిని విచారించాకుండా సీబీఐ హడావిడిగా ఎందుకు చార్జిషీట్ దాఖలు చేసింది..? ఇందులో కుట్ర ఏమిటి..? అని ప్రశ్నిస్తున్నాం. కేవలం ఈ కేసులో అరెస్ట్ అయి 90 రోజులు పూర్తి అయిన జగతి వైస్ చైర్మన్  విజయసాయి రెడ్డి గారికి బెయిలు రాకుండా అడ్డుకోవడం కోసమే ..  సీబీఐ ఇంత ఆరాటం ప్రదర్శించింది. ప్రపంచంలో ..ప్రభుత్వ కార్యదర్శి పైనా.. ఐఏఎస్  అధికారులపైనా .. మంత్రుల పైనా పిర్యాదులు వస్తే .. ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ఉండదు. కాని జగన్ ఆస్తుల కెసులో మాత్రం .. ప్రభుత్వం ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదు..? అని ప్రశ్నిస్తున్నాం. అసలు ప్రభుత్వ జీ.ఓ.లను ఉపయోగించుకొని అవినీతి జరిగిందని చెబుతూనే .. అసలు దీనికి కారకులైన ఐఏఎస్  అధికారులను ,మంత్రులను సీబీఐ ఎందుకు ప్రశ్నించలేదు. ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష తోనే  సీబీఐ జగన్ పేరును ఏ-1గా చార్జిషీట్ లో పెట్టింది . అటు న్యాయస్థానంలో.. ఇటు ప్రజా కోర్టులోనూ కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు ఆడుతున్న కుట్రలను బయటపెడతాం. అంతిమ విజయం న్యాయం,ధర్మానిదే.

Back to Top