చంద్రబాబు పాలన చీకటీ అధ్యాయంవిశాఖ జిల్లాః ‘రాజన్నబిడ్డ’ పాలన కోసం ఎదురు చూస్తుందని  వైయస్‌ఆర్‌సీపీ నేత వరుదు కల్యాణి అన్నారు. విశాఖ జిల్లా కె.కోటపాడు బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. దివంతగ మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణంతో నిలిచిపోయిన అభివృద్ధి మళ్లీ  జననేత జగన్‌తో పురోగమిస్తుందన్నారు. మాటతప్పని మడమ తిప్పని  జగనన్న భరోసాతో వైయస్‌ఆర్‌సీపీకి పట్టం కట్టడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారన్నారు. దివంగత మహానేత  60 నెలల పాలనలో 60 సంవత్సరాలకు సరిపడే కిర్తీని సంపాదించి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, చంద్రబాబు ఆరువందల అబద్ధపు హామీలు ఇచ్చి మన రాష్ట్ర్రాన్ని  మరో 60 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారని విమర్శించారు.చంద్రబాబు పాలన ఒక చీకటి అధ్యాయంగా అభివర్ణించారు, వైయస్‌ఆర్‌ హయాంలో ప్రజలు స్కీంలు గురించి మాట్లాడుకునేవారని, నేడు చంద్రబాబు పాలనలో స్కాంలు గురించి మాట్లాడుకుంటున్నారన్నారు.
 
Back to Top