పెద్ద మక్కెన లో మహానేత విగ్రహావిష్కరణ

గుంటూరు: 

ప్రజా సంకల్పయాత్రలో భాగంగా తన గ్రామానికి వచ్చిన జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డికి  పెదమక్కెన గ్రామంలో  ఘన స్వాగతం లభించింది.  ఈ సందర్బంగా గ్రామంలో ఏర్పాటు చేసిన మహానేత వైయస్ ఆర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహానేత సేవలను స్మరించుకుంటూ, ప్రస్తుతం తాము ఎదుర్కుంటున్న సమస్యలను గ్రామస్థులు ప్రతిపక్ష నేతకు వివరించారు. వీరందరి సమస్యల పరిష్కారానికి  కృషి చేస్తానంటూ ఈ సందర్భంగా వైయస్ ఆయన భరోసా ఇచ్చారు.

Back to Top