స‌త్తెన‌ప‌ల్లి శివారు నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం


గుంటూరు : ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. వైయ‌స్ జగన్ 122వ రోజు ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. బుధవారం ఉదయం ఆయన సత్తెనపల్లి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి రామకృష్ణాపురం మీదగా నందిగామ్‌ చేరుకుంటారు. అక‍్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం గుడిపూడి కాలనీ మీదగా గుడిపుడి చేరుకుని అక్కడ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను వైయ‌స్ జగన్ ఆవిష్కరిస్తారు. 

Back to Top