అనాథాశ్రమాన్ని సందర్శించిన జననేత

 
అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాప్తాడు నియోజకవర్గంలోని కూరుకుంట గ్రామంలోని అనాథాశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడున్న వారితో మమేకమై వారి కష్టాల్లో పాలు పంచుకున్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి మండలంలో ఓ అనాథ ఆశ్రమం ఏర్పాటు చేసి ప్రభుత్వమే వారి బాగోగులు చూస్తుందని హమీ ఇచ్చారు.
 
Back to Top