కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారనడానికి తాజాగా మరో ఉదాహరణ వెలుగు చూసింది. మహానేత పాలనలో లబ్ధిపొందిన కారుమంచి గ్రామానికి చెందిన గొల్ల రమణ అనే రైతు తన పొలంలో సొంత నిధులతో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తమ గ్రామానికి వచ్చిన రాజన్న బిడ్డ వైయస్ జగన్ మోహన్ రెడ్డితో ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయించారు. మహానేతపై అన్నదాత చూసిన అభిమానాన్ని స్థానికులు అభినందిస్తున్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలో మా కుటుంబానికి పంట రుణాలు మాఫీ అయ్యాయని, ఇల్లు కట్టించారని గొల్ల రమణ పేర్కొన్నారు. ఇంత చేసిన మహానేతకు గుర్తుగా తన సొంత నిధులు రూ.50 వేలు ఖర్చు చేసి విగ్రహం ఏర్పాటు చేసుకున్నానని చెప్పారు. ఈ విగ్రహాన్ని వైయస్ జగన్ ఆవిష్కరించడం సంతోషంగా ఉందని రమణ పేర్కొన్నారు.