కాకినాడ నగరంలో అడుగుపెట్టిన వైయస్‌ జగన్‌


తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ కొద్దిసేపటి క్రితమే కాకినాడ నగరంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌కు కాకినాడ వాసులు అపూర్వ స్వాగతం పలికారు. కాసేపట్లో సంచ చెరువు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభకు వేలాదిగా తరలిరావడంతో కాకినాడ నగరం కిటకిటలాడుతోంది.
 
Back to Top