చిన మక్కెనకు రోడ్డు నిర్మించడం లేదు


గుంటూరు:  రాజధానికి 20 కిలోమీటర్ల దూరం ఉన్న చిన్న మక్కెన గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదని గ్రామస్తులు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. మా గ్రామంలో వైయస్‌ఆర్‌సీపీ సానుభూతి పరులు ఉన్నారన్న సాకుతో రోడ్డు వేయడం లేదన్నారు. గ్రామం నుంచి పట్టణానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు.  ఎమ్మెల్యే రోడ్డు నిర్మాణాన్ని విస్మరించారని తెలిపారు. వారి సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ మరో ఏడాది ఆగితే మంచి రోజులు వస్తాయని హామీ ఇచ్చారు.
 
Back to Top