తురక శాసనం నుంచి 337వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 శ్రీకాకుళం: ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు,  ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 337వ రోజు పాదయాత్రను శనివారం ఉదయం ఇచ్చాపురం నియోజకవర్గంలోని తురక శాసనం క్రాస్‌ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి సోంపేట మండలంలోని పాలవలస, కొర్లాం, బారువకూడలి మీదుగా లక్కవరం వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తారు.

అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తామూ భాగం కావాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

 

Back to Top