నారాయణ పురం నుంచి 336వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 
 శ్రీకాకుళం: ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 336వ రోజు పాదయాత్రను బుధవారం ఉదయం పలాస నియోజకవర్గం, వజ్రకొత్తూరు మండలం నారాయణ పురం శివారు నుంచి ప్రారంభించారు.  అక్కడి నుంచి హరిపురం, అంబుగాం మీదుగా ఇచ్ఛాపురం నియోజకవర్గం సోంపేట మండలం రాణిగాం, మామిడిపల్లి, పాత్రపురం క్రాస్‌, తరకసాసనం క్రాస్‌ వరకు వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగిస్తారు.

అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

Back to Top