తిరుపతిలో భూకబ్జాలు, రౌడీయిజంపై వైయ‌స్ఆర్‌సీపీ ఆందోళన

 తులసమ్మకు అండగా ధర్నా చేపట్టిన భూమన అభినయ్ రెడ్డి

తిరుపతి: తిరుపతి శివజ్యోతి నగర్ జర్నలిస్ట్ కాలనీలో జరుగుతున్న భూకబ్జాలు, రౌడీయిజం ఘటనలపై వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. బాధితురాలు తులసమ్మకు అండగా తిరుపతి వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త భూమ‌న అభిన‌య్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానికంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ, పేద కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేస్తూ తిరుపతిలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆకు రౌడీ, పేట రౌడీలుగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ జేబీ శ్రీనివాస్, రవి నాయుడు మరియు వారి అనుచరులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భూకబ్జాలకు పాల్పడుతున్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు పూర్తి రక్షణ కల్పించాలని, నగరంలో పెరుగుతున్న రౌడీయిజానికి అడ్డుకట్ట వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల హక్కుల కోసం వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.తిరుపతిలో భయపెట్టే రాజకీయాలకు ప్రజలే గట్టి సమాధానం చెబుతారని పేర్కొన్న భూమన అభినయ్ రెడ్డి, ఎవరికి అన్యాయం జరిగినా తిరుపతి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

Back to Top