<br/>విజయనగరం: రామభద్రాపురం మండలంలో సాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు అప్పలనాయుడు పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్ర 291వ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. సమస్యలన్నీ కూడా వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. <br/>