ముగిసిన 60వ రోజు పాద‌యాత్ర‌

చిత్తూరు:  వైయ‌స్‌ఆర్‌ సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహన్‌ రెడ్డి  చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 60వ రోజు పాద‌యాత్ర కొద్దిసేప‌టి క్రిత‌మే ముగిసింది. శుక్రవారం ఉదయం చంద్రగిరి నియోజకవర్గం పాత వేపకుప్పం శివారు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి ఎల్వీ పురం క్రాస్‌, నేతకుప్పం, తిమ్మరాజుపల్లి, గొల్లపల్లి, సి. కాలేపల్లి, చిటతూరు, హరిజనవాడ, రాయలచెరువుల మీదుగా కుప్పం బాదురు వరకూ పాదయాత్ర కొనసాగింది. ఇవాళ 11.8 కిలోమీట‌ర్లు పాద‌య‌త్ర చేశారు. ఇప్పటివరకు వైయ‌స్‌ జగన్ 830 కిలోమీటర్లు నడిచారు.
Back to Top