కొప్పర్రు నుంచి 176వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 

ప‌శ్చిమ గోదావ‌రి: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 176వరోజు బుధవారం ఉదయం వైయ‌స్‌ జగన్ పాదయాత్రను పశ్చిమ గోదావరి జిల్లా కొప్పర్రు శివారు నుంచి ప్రారంభించారు. కొప్పర్రు నుంచి లిఖితపూడి, సరిపల్లి మీదగా పాదయాత్ర కొనసాగనుంది. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. విరామం అనంతరం చిన మామిడిపల్లి, నరసాపురం, స్టీమర్‌ రోడ్డు వరకూ వైయ‌స్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర చేస్తారు.  నరసాపురంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగిస్తారు.

 
Back to Top