జోరువానలోనే ప్రారంభ‌మైన 241వ రోజు ప్రజాసంకల్పయాత్ర

 
 

 విశాఖపట్నం: జనజాతర పోటెత్తింది. జనం ప్రభంజనంలా మారింది. జననేత వెంట కదం తొక్కింది. పూలదారులద్దింది. మంగళహారతులు పట్టింది. జోరువానను సైతం లెక్క చేయకుండా సంకల్ప సూరీడు అడుగులో అడుగువేస్తూ ఉరకలెత్తింది. ప్రజాకంటక పాలనలో తాము పడుతున్న అవస్థలను అడుగడుగునా జననేత దృష్టికి తీసుకురాగా.. త్వరలోనే మనందరి ప్రభుత్వంలో మీ అందరి కష్టాలు తీరుతాయంటూ ఆయన భరోసా ఇస్తున్నారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న ప్రజాసంకల్పయాత్ర 241వ‌ రోజు సోమ‌వారం జోరు వాన‌లోనే మొద‌లైంది.  జ‌న‌నేత పాదయాత్రకు అడుగడుగునా జనం బ్రహ్మరథం పడుతున్నారు.
Back to Top