శ్రీకాకుళంః వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది.312వ రోజు షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. మంగళవారం ఉదయం రాజాం బసచేసే ప్రాంతం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు.అక్కడ నుంచి వీఆర్ అగ్రహారం క్రాస్,పోగిరి,మారివలస క్రాస్ వరుకు కొనసాగుతుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం పాదయాత్ర కొనసాగుతుంది.గిద్దెలపేట క్రాస్, మెట్టవలస క్రాస్,పాల కాండెం,సంతపర్తి వరుకు కొనసాగుతుందని తలశీల రఘురాం తెలిపారు.