విశాఖలో జన సునామి

విశాఖ నగరం
జనసంద్రంతో ఉప్పొంగుతోంది. వైయస్‌ జగన్‌కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం
పడుతున్నారు. మరి కాసేపట్లో  ప్రారంభం
కానున్న భారీ బహిరంగ సభకు  వైయస్‌ జగన్‌ బహిరంగ సభ వీక్షణకు నగరంలో ఎల్‌ఈడీ స్క్రీన్లు
ఏర్పాటు చేశారు. వైఎంసీఏ,గోకుల్‌ పార్కు,
సీఎంఆర్, సెంట్రల్‌ పార్కు,శివాజీ పార్కు, ఏన్‌ఏడీ జంక్షన్,గాజువాక జంక్షన్‌లో
భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూలల నుంచి ఉదయం నుంచే
లక్షలాది ప్రజలు సభ వద్దకు చేరుకున్నారు. వైయస్‌ జగన్‌ను సీఎంను చేసుకుంటామని
ప్రజలంతా ఘంటాపథంగా చెప్పుతున్నారు.వైయస్‌ జగన్‌లో రాజన్నను చూసుకుంటున్నామన్నారు.

Back to Top