తిత్లీ తుఫాను సహాయాన్ని మింగేసిన పచ్చ చొక్కాలు

శ్రీకాకుళం తిత్లీ తుఫాను వచ్చి నెలలు గడుస్తున్నా
ప్రభుత్వం ఇంతవరకు తమను ఆదుకోలేదని పలురువు రైతులు ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్
మోహన్ రెడ్డి తో వాపోయారు. సోమవారం పాదయాత్ర చేస్తున్న జననేతను కలుసుకును తమ
సమస్యలను విన్నవించారు.  జిల్లాలోని నరసన్నపేట
మండలంలోని ప్రజలను అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని వారు తెలిపారు.  మిగిలిన మండలాల్లో కూడా నష్టపరిహారంగా వచ్చిన
దానిలో సగం మొత్తాన్ని తెలుగుదేశం కార్యకర్తలే మింగేశారన్నారు. పంటపొలాల్లో సైతం వారికి
సంబంధించిన వాటికే అధికారులను తీసుకెళ్లి, నష్టపరిహారం రాయించి, అందులో కూడా
ఎక్కువ మొత్తాన్ని జన్మభూమి కమిటీలే తినేశాయని వారు జననేతకు ఫిర్యాదు చేశారు. ఇలా
అడుగడుగునా దోచుకుతింటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Back to Top