రాజకీయ వివక్షత చూపిస్తున్నారన్నా..

వైయస్‌ జగన్‌ను కలిసిన దళిత కుటుంబాలు

శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను దళిత కుటుంబాలు కలిశాయి. పలాస మున్సిపాలిటీలో సంక్షేమ పథకాలు అందడం లేదని జననేత దృష్టికి తీసుకొచ్చారు.ప్రతి పనిలో రాజకీయ వివక్షత చూపిస్తున్నారని ఆరోపించారు.పచ్చ చొక్కాలకే లబ్ధి చేకూరుస్తున్నాని మండిపడ్డారు. మంచినీటి చెరువులను కూడా ఆక్రమించి తాగునీటి కొరత సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పేదవారికి రుణాలు మంజూరు చేయడం లేదన్నారు.టీడీపీ ప్రభుత్వం పాలనలో తాగునీటికి నోచుకోలేదని వాపోయారు.

Back to Top