62వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌

చిత్తూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 62వ రోజు షెడ్యూల్‌ విడుదలైంది. ఆదివారం ఉదయం చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పాతకందులవారిపల్లె నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కట్టకింద వెంకటాపురం, చల్లవారిపల్లి, మంతోపురుపల్లి, కమ్మవారిపల్లె, దేసురివారి కండ్రిగ,  రావిళ్లవారిపల్లె, పరకాల్వ వరకు సాగుతుంది. ఆ తరువాత భోజన విరామం ఉంటుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం తెలిపారు.
 
Back to Top