కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి

వైయస్‌ జగన్‌ను కలిసిన ఏపీ మోడరన్‌ స్కూల్‌ కాంట్రాక్టు ఉద్యోగులు
విజయనగరంః ఏపీ స్టేట్‌ గవర్నమెంట్‌ మోడరన్‌ స్కూల్‌ జౌట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, సుప్రీంకోర్డు ఇచ్చిన ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.వైయస్‌ జగన్‌ సీఎం అవుతారనే సంపూర్ణ నమ్మకంతోనే ఆయనకు వినతిపత్రం ఇచ్చినట్లు  ఉద్యోగులు తెలిపారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి  ఏపీకి ఎంతో మేలు చేశారని,ఆయన తనయుడు వైయస్‌ జగన్‌ కూడా ఆయన ఆశయసాధనకు కృషిచేస్తారనే విశ్వాసం ప్రజల్లో ఉందన్నారు. రాష్ట్రంలో మూడు లక్షల మంది జౌట సోర్సింగ్‌ ఉద్యోగులం ఉన్నామని,వైయస్‌ జగన్‌కే మేమంతా అండగా ఉంటామన్నారు.

తాజా వీడియోలు

Back to Top