ప్రకాశం జిల్లా: జిల్లా పరిషత్ సమావేశంలో ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. జెడ్పీటీసీలకు గౌరవ వేతనం ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. రాష్ట్రం ఇప్పటికే 3 లక్షల 40 వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని, అయినా ప్రజాప్రతినిధులకు కనీస గౌరవ వేతనం ఇవ్వకపోవడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. శాసన మండలిలో ప్రశ్నలు అడిగినా సమాధానాలు రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను అవమానపరచవద్దని హెచ్చరిస్తూ, జడ్పి సమావేశానికి ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరుకాకపోవడం బాధాకరమని తెలిపారు. తల్లికి వందనం వంటి పథకాలు సరిగా అమలు కావడం లేదని ఆరోపించారు. సమావేశానికి డీఈఓ హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, వచ్చే ఎన్నికల్లో కూటమికి ఒక్క సీటు కూడా రాదని వ్యాఖ్యానించారు.