వేమవరం గ్రామాన్ని అభివృద్ధి చేయండి

గుడివాడ : మంచినీటి సౌకర్యం లేక పశువులు స్నానం చేసే చెరువులోని నీరు తాగుతున్నామని వేమవరంకు చెందిన ముస్లిం మహిళలు జననేతకు వారి సమస్యను చెప్పుకున్నారు. గుడివాడ నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో ముస్లిం మహిళలు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను జననేత దృష్టికి తీసుకువచ్చారు. గ్రామానికి సరైన రోడ్డు లేదని, పది రోజులు కరెంటు ఉంటే.. పది రోజులు ఉండదని, మూడు సంవత్సరాలుగా రేషన్‌ సరుకులు కూడా ఇవ్వడం లేదని, పింఛన్‌కు దరఖాస్తులు చేసుకుంటే ఇవ్వడం లేదని వారి బాధలను చెప్పుకున్నారు. చంద్రబాబు రుణమాఫీ చేయకపోవడంతో బంగారం అమ్మేసి బ్యాంక్‌లకు డబ్బులు కట్టామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాన్ని అభివృద్ధి చేయాలని జననేతకు విజ్ఞప్తి చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top