బాబు వస్తే జాబన్నారు..ఉన్న జాబు ఊడగొట్టారు..


వైయస్‌ జగన్‌కు ఎన్‌ఆర్‌సి ఉద్యోగుల మొర..

శ్రీకాకుళంః బాబు వస్తే జాబు వస్తుందన్నారు..కాని బాబు  వచ్చి జాబు ఊడగొట్టారని ఎన్‌ఆర్‌సి డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.  వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. అకారణంగా ఉద్యోగాల నుంచి తొలగించారని వాపోయారు.ఉపాధి కల్పించాలని కోరారు. సుమారు ఏడు సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న తమను ఆర్‌వోపి ప్రకారం బడ్జెట్‌ లేదని ఉద్యోగాల నుంచి తొలగించి రోడ్డున పడేశారన్నారు.కోర్టుకు వెళ్ళిన ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఉద్యోగం పనే ఆధారపడి జీవిస్తున్నామన్నారు. న్యాయం చేయాలని వైయస్‌ జగన్‌ను కోరారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top