వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ఉల్లి రైతులు

అనంత‌పురం:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా త‌మ గ్రామానికి వ‌చ్చిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఉల్లి రైతులు మంగ‌ళ‌వారం క‌లిశారు. అవులంప‌ల్లె క్రాస్ వ‌ద్ద రైతులు జ‌న‌నేత‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. ఉల్లిధ‌ర‌లు మార్కెట్లో విఫ‌రీతంగా పెరిగినా..త‌మ‌కు మాత్రం గిట్టుబాటు ధ‌ర ద‌క్క‌డం లేద‌ని వాపోయారు. క‌నీసం పెట్టుబ‌డులు రావ‌డం లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రైతు స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ మ‌రో ఏడాది ఓపిక ప‌ట్టాల‌ని, మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చాక అన్ని పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర కల్పిస్తామ‌న్నారు. చంద్ర‌బాబు హెరిటేజ్ షాపుల్లో రేట్లు ఆకాశానికి అంటుతున్నాయ‌ని, రైతుల‌కు మాత్రం క‌నీసధ‌ర ద‌క్క‌డం లేద‌ని, ఇలాంటి పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడుదుమ‌ని పిలుపునిచ్చారు.
Back to Top