ప్రజా సంకల్పయాత్రకు న్యాయవాదుల మద్దతు

నెల్లూరు: న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు మోసం చేశాడని న్యాయవాదులు మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే బతుకులు బాగుపడతాయని అభిప్రాయపడ్డారు. ప్రజా సంకల్పయాత్ర ముగింపు సందర్భంగా నెల్లూరు జిల్లా కోర్టు నుంచి గాంధీ విగ్రహం వరకు న్యాయవాదులు సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వైయస్‌ జగన్‌ చేస్తున్న పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారంతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని వైయస్‌ జగన్‌ భరోసానిచ్చారని వారు చెప్పారు. న్యాయవాదులను అన్ని రకాలుగా ఆదుకుంటానని మాట ఇచ్చిన చంద్రబాబు మోసం చేశాడని మండిపడ్డారు. న్యాయవాదులంతా వైయస్‌ఆర్‌ సీపీకి మద్దతుగా ఉన్నారని, చంద్రబాబును చిత్తుగా ఓడిస్తామన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top