ఉత్సాహంగా ``వైయ‌స్ఆర్ కుటుంబం``

ఒప్పిచర్ల(కారంపూడి, మంగ‌ళ‌గిరి): మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలో వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మం ఉత్సాహంగా కొన‌సాగుతూనే ఉంది.  బూత్‌ కన్వీనర్లు అంగిరేకుల మల్లయ్య, పాలకీర్తి సైదులు, జార్జి, బత్తిన శ్రీను, ఇరికెదిండ్ల చినకొండలు, ఉన్నం హరిబాబులు తమ వార్డులలో పర్యటించి జగనన్న ప్రకటించిన నవరత్నాలను ప్రచారం చేస్తూ వైయ‌స్ఆర్ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నారు.  ఇప్పటికే ఒక వార్డు మినహా అన్నింటిలో లక్ష్యాన్ని పూర్తి చేశామని గ్రామ పార్టీ నాయకుడు వంకాయలపాటి పిచ్చెయ్య తెలిపారు. గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ పంగులూరి చినవెంకటనర్సయ్య, మాజీ ఎంపీటీసీ ఓగూరి రామయ్య, జిల్లా పార్టీ కార్యదర్శి చిరుమామిళ్ల శ్రీనివాసరావు, కర్నాటి రాధ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.

Back to Top