టెక్కలిః టీడీపీకి అనుకూలంగా లేమన్న కారణంతో అన్ని అర్హతలున్నా పింఛన్లు ఇవ్వడం లేదని పలువురు గ్రామస్తులు వాపోయారు. గడప గడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో భాగంగా టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ తిర్లంగి గ్రామoలో పర్యటించారు. ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాబు మోసపూరిత హామీలపై ప్రజాబ్యాలెట్ పంపిణీ చేశారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో, గ్రామంలో కనీస మౌళిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తిలక్ విమర్శించారు. పేదల సమస్యలు తీరాలంటే వైయస్ జగన్ అధికారంలోకి రావాలన్నారు. అందుకోసం మనమంతా సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.