గడపగడపలో ఘన స్వాగతం

గడపగడపలో వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది. ప్రజలు వైయస్సార్సీపీ నేతలకు ఘన స్వాగతం పలుకుతున్నారు. తమ సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన నాయకులకు టీడీపీ పాలనలో మోసపోయిన తమ గాథను చెప్పుకొని కన్నీరు పెడుతున్నారు. చంద్రబాబును నమ్మి మోసపోయామని వాపోతున్నారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నెల్లూరులోని 41వ డివిజన్ లో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపట్టారు.ఇంటింటికీ వెళ్లి టీడీపీ పాలనలో దగాపడిన ప్రజలకు మేమున్నామంటూ భరోసా కల్పించారు. 

విశాఖ జిల్లా అరకు సమన్వయకర్తలు అరుణకుమారి, సోము, సూర్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి శెట్టి అప్పాలు హుకుంపేట మండలంలోని బారమోసి గ్రామంలో గడపగడపలో పర్యటించారు. మరోవైపు, చోడవరం మండలం శ్రీరాంపట్నంలో కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ విజయప్రసాద్ 68వ వార్డులో పర్యటించారు.  ఈ సందర్భంగా వారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు ప్రభుత్వంపై పోరాడుదామని పిలుపునిచ్చారు. 

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని శివరామపురం, జగన్నాథపురం గ్రామాల్లో ముత్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైయస్సార్సీపీ శ్రేణులు గడపగడపలో పర్యటించారు. బాబు మోసాలను ఎండగట్టారు. ప్రజాబ్యాలెట్ ను అందించి బాబు పాలనకు మార్కులు వేయాలని కోరారు. ఈంసదర్భంగా నమ్మి ఓట్లేసినందుకు నట్టేట ముంచిన బాబుకు ప్రజలు సున్నాతో చుట్టేశారు. 

కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి సదాపురం, దిబ్బనకల్లు గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లారు. ప్రజల కష్టాలను పంచుకున్నారు. మరోవైపు, బనగానపల్లె మండలం యాగంటిపల్లె గ్రామంలో కాటసాని రామిరెడ్డి గడపగడపకూ వెళ్లారు. బాబు మోసపూరిత పాలనను వివరించారు. వారి సాధకబాధలను అడిగి తెలుసుకున్నారు. వైయస్ జగన్ ను సీఎం చేసుకొని జీవితాలను బాగుపర్చుకుందామని ఈసందర్భంగా వారు ప్రజల్లో ధైర్యం కల్పించారు. 

Back to Top