ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా అతీ గతీ లేదు

ఎమ్మిగనూరుః ప్రజాసమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. పూలచింతలో గడపగడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి బాబు మోసపూరిత పాలనను వివరించారు. ప్రజాబ్యాలెట్ ను పంపిణీ చేసి బాబు పాలనపై మార్కులు వేయించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ సమస్యలను జగన్మోహన్ రెడ్డి వద్ద ఏకరవు పెట్టారు. పింఛన్లు, రేషన్ కార్డులు, గృహాలు మంజూరు కావడం లేదని వాపోయారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా, ఇంతవరకూ అతీగతీ లేదని ఆవేదన వెలిబుచ్చారు. ఉన్న పింఛన్లను కూడా రద్దు చేస్తున్నారని ఆగ్రహించారు.


Back to Top