బాబు పాలనపై దుమ్మెత్తిపోస్తున్న ప్రజలు

కర్నూలుః చంద్రబాబు రైతు వ్యతిరేకని శ్రీశైలం నియోజకవర్గ ఇంఛార్జ్ బుడ్డా శేషారెడ్డి విమర్శలు గుప్పించారు. అబ్బీపురం గ్రామంలో నిర్వహించిన గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని శేషారెడ్డి ఫైర్ అయ్యారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ఏగ్రామానికి వెళ్లినా ప్రజలు బాబు పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిన బాబుకు ప్రజలు ఉసురు తగులుతుందని హెచ్చరించారు. 


శ్రీకాకుళంః అక్రమ సంపాదనకు అలవాటు పడి ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించిందని శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మండిపడ్డారు. పాతపట్నం నియోజకవర్గం ఎల్ఎన్ పేట మండలం ఇందిరా నగర్ కాలనీ, లక్ష్మీనర్సుపేట గ్రామాల్లో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు పాలన వైఫల్యాలను గడపగడపలో ఎండగట్టారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి...అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు ఊడబెరుకుతున్నారని విమర్శించారు. రైతులు, డ్వాక్రా మహిళలు, ప్రతీ వర్గాన్ని బాబు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Back to Top