పింఛన్ల మంజూరులో అర్హులకు అన్యాయం

నెల్లూరు(కొండాపురం): పింఛన్ల మంజూరులో అర్హులకు అన్యాయం జరుగుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన వెల్లిగండ్ల పంచాయతీ  బసిరెడ్డిపల్లి గ్రామాల్లో గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి ఇంటింటా పర్యటించి ప్రజాబ్యాలెట్‌ అందజేశారు.  ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అన్ని అర్హతలు ఉన్నా..పింఛన్లను తొలగించారని చాలా మంది వితంతువులు, వికలాంగులు ఫిర్యాదు చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు దాటిన గెలిచిన ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఇటువైపు కన్నెత్తి చూడలేదని ఆగ్రహం వ్యకం చేశారు. అధికార పార్టీ నాయకులు   పారంబోకు భూములనే కాకుండా స్మశాన స్థలాలను కూడా ఆక్రమించి సాగు చేసుకుంటున్నారని తెలిపారు. ఈ సమస్యలపై  మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి స్పందించారు. మీ సమస్యలను ఎంపీ రాజమోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్‌ యారవ నరసింహరావు, మాజీ సర్పంచ్‌లు వేమిరెడ్డి మల్లికార్జునరెడ్డి, పిన్నిక కొండయ్య, అరవ మాలకొండయ్య, మాజీ ఎంపీటీసీలు  యరజాల మాల్యాద్రి, బండారు పుల్లయ్య, నాయకులు చల్లా ఎ్రరకొండయ్య, కోనేటి ప్రసాద్, చిమ్మిలి శ్రీనివాసులు, నల్లగర్ల మాలకొండయ్య, కొమ్మి, ఇస్కదామెర్ల వైస్‌ సర్పంచ్‌లు కొండ్రాజు మాల్యాద్రి, ఇరగల శేఖర్‌రెడ్డి, వీరెళ్ల చంద్రయ్య, చెన్నుబోయిన చినకొండయ్య, డి కాశయ్య, చిట్టాబత్తిన రామూర్తినాయుడు, యారవ వెంకటేశ్వర్లు, వైయస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top