నిత్య ‘కృషీవలుడు’

వ్యవసాయ రంగం రాష్ట్రంలో అన్ని విధాలుగా ధ్వంసమైపోయిన తరుణంలో డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర పాలనాధికారం చేపట్టి మౌలికమైన, సుస్థిరమైన మార్పునకు నాంది పలికారు. రైతుల సంక్షేమం కోరి, జయతీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పరచి ఆమె సిఫార్సులను అమలు చేసేందుకు గట్టి కృషి చేశారు.

కోనేరు రంగారావు కమిషన్ భూమికి సంబంధించి చేసిన సిఫార్సులలో కొన్నింటిని తీసుకుని శ్రద్ధగా అమలుపరిచారు. రైతాంగానికి ఉచిత విద్యుత్తును అందించి కరెంటు కష్టాల నుంచి వారిని గట్టెక్కించారు. చాలినన్ని జలవనరులు అందించి వ్యవసాయరంగాన్ని స్వయంసమృద్ధి దిశగా నడిపించారు.

నిద్రావస్థలో ఉన్న సహకార పరపతి సంఘాలను పునరుద్ధరించారు. రుణాల మాఫీతోపాటు, రుణాలపై వడ్డీ మాఫీచేసి లక్షలాది మంది రైతులకు మేలుచేశారు. రుణవసతిని మూడింతలు పెంచారు. పావలా వడ్డీ రుణ పథకాన్ని రైతాంగానికి అమలు చేయడంతో ఆగక వారికి నష్టపరిహారం కూడా చెల్లించి ఆదుకున్నారు. వ్యవసాయ బీమా పథకాన్ని అమలుచేసేందుకు కృషిచేశారు.

తాడేపల్లిగూడెం సమీపంలో ఉద్యానవన విశ్వవిద్యాలయం స్థాపించి రైతాంగానికి స్వావలంబన కల్పించేందుకు తన వంతు ప్రయత్నంచేశారు. పాడి-పంటల మధ్య అన్యోన్యతను గుర్తెరిగి పాడి పరిశ్రమను పెంచి పోషించేందుకు ‘పశుక్రాంతి’ పథకం ఆరంభించారు. ‘ఇందిరా క్రాంతి’ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ రైతులు పండించే పంటను సెల్ఫ్ హెల్ప్ మహిళా గ్రూపుల ద్వారా కొనుగోలు చేయించి దళారీల బెడదను తొలగించారు.

వై‌యస్ అనంతర కాలంలో.. వ్యవసాయరంగం త్రీవ సంక్షోభంలో పడింది. సాగునీరు, విద్యుత్తు కొరతతో పాటు విత్తనాలు, ఎరువుల కొరత, ప్రోత్సాహకాలలేమి, సాంకేతిక విజ్ఞానం కొరత రైతాంగాన్ని బలవంతపు ‘పంట సెలవు’ దిశగా నెడుతున్నాయి. వైయస్ స్ఫూర్తి లేకుండా ఈ పరిస్థితిలో మార్పు అసాధ్యం.

-ప్రొ॥కె.ఆర్. చౌదరి, వ్యవసాయరంగ నిపుణులు

Back to Top